సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం పరిస్థితి విషమం

Advertisement

ప్రముఖ లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యంకు కరోనా సోకినా విషయం తెలిసందే. అయితే చెన్నై లోని ఎంజీఎం ప్రవేట్ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుంటున్నాడు బాలు. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి సిబ్బంది హెల్త్ బులిటెన్‌ విడుదల చేశారు. ఆ హెల్త్ బులిటెన్ లో తన ఆరోగ్యం మెరుగ్గానే ఉందని పేర్కొన్నారు వైద్యులు.

అయితే తాజాగా మరో హెల్త్ బులిటెన్ విడుదల చేసారు వైద్యులు. గురువారం రాత్రి ఆయన తిరిగి అస్వస్థతకు గురి కావడంతో వైద్య నిపుణుల సూచన మేరకు వెంటనే ఆయన్ని ఐసీయూకి తరలించాం. ప్రత్యేక వైద్య నిపుణుల బృందం నిరంతరం ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తోంది అని ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది వెల్లడించాయి. తాను తొందరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here