ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా

Advertisement

కరోనా ఎవ్వరిని వదలడం లేదు. ఇప్పటికే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు చాలా మంది కూడా కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ గా నిర్దారణ అయ్యింది. కరోనా లక్షణాలు ఉన్న అతను టెస్టులు చేయించుకోగా పాజిటివ్ అని తేలింది. ప్రస్తుతం బాలు చెన్నై లో ఉంటున్నాడు. అక్కడే ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్య౦ నిలకడగా ఉన్నట్టు తెలుస్తుంది. స్వల్ప లక్షణాలతో ఆయనకు కరోనా వచ్చింది. అలాగే అతని కుటుంబసభ్యులు అందరిని కూడా అధికారులు హోమ్ క్వారంటైన్ లో ఉంచారు. ఇప్పటికే సింగర్ స్మిత కూడా కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆమె ఇప్పుడు హోమ్ క్వారంటైన్ లో ఉండి చికిత్స పొందుతుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here