విషమంగానే ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం

Advertisement

ప్రముఖ లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి చెన్నై లోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తన ఆరోగ్యం పై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. అయితే ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. అలాగే ఇప్పటికి ఐసీయూలో వెంటిలేటర్ పై ఎక్మో సపోర్ట్ తో ట్రీట్ మెంట్ కొనసాగిస్తున్న వైద్యులు తెలిపారు. గతంలో అపోలో ఆసుపత్రిలో చివరి దశలో తమిళనాడు మాజీ సీఎం జయలలితకు ఇదే విధంగా ఎక్మో సిస్టమ్ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు వైద్యులు. ఇక ప్రత్యేక వైద్యుల బృందం పర్యవేక్షణలో ఆయనకు చికిత్స జరుగుతుందని వెల్లడించారు.
ఇంతలోనే వైద్యులు తన పరిస్థితి విషమంగా ఉందని చెప్పడం తో అభిమానులు అందరు కూడా ఆందోళన చెందుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here