ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్యం పై హెల్త్ బులిటెన్

Advertisement

ప్రముఖ లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కరోనా బారిన పడి చెన్నై లోని ఎంజిఎం ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన ఆరోగ్యంపై ఎంజీఎం ఆసుపత్రి వైద్యులు మరోసారి హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ప్రస్తుతం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. వెంటిటేలర్‌, ఎక్మో సహాయంతో ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆసుపత్రి అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ అనురాధ భాస్కరన్‌ ఈ బులిటెన్‌ విడుదల చేశారు. బాలు స్పృహలోకి వచ్చారని, వైద్యానికి స్పందిస్తున్నారని బులిటెన్‌లో పేర్కొన్నారు. ఒకవైపు ఆయన ఆరోగ్యం పై వైద్యులు ఎల్లవేళలా పరివేక్షించి వివరాలు తెలుపుతున్నారు. అలాగే బాలు అభిమానులు, బంధువులు, సన్నిహితులు తొందరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here