Singer Mangli Injured : సింగర్ మంగ్లీకి తీవ్ర గాయాలు.. ఆస్పత్రిలో చేరిక..!
NQ Staff - June 26, 2023 / 10:42 AM IST

Singer Mangli Injured : ఈ నడుమ వరుసగా సినీ సెలబ్రిటీలు గాయాల పాలు అవుతున్నారు. తాజాగా మరో స్టార్ సింగర్ మంగ్లీ కూడా గాయాల పాలు అయింది. ప్రస్తుతం తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా ఆమె ఓ ప్రైవేట్ సాంగ్ షూటింగ్ లో పాల్గొంది. అది కూడా బోనాల సాంగ్. అయితే ఈ సాంగ్ షూటింగ్ లో డ్యాన్స్ చేస్తుండగా ఆమె కాలు జారి కింద పడింది.
దాంతో ఆమె కాలికి తీవ్ర గాయమైంది. వెంటనే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె కాలికి ట్రీట్ మెంట్ చేసిన డాక్టర్లు కొన్ని రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత ఆమెను డిశ్చార్జి చేశారు. ఈ విషయం తెలుసకున్న ఆమె అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సింగర్ గా మంగ్లీ ఇప్పుడు చాలా ఫేమస్. ఇప్పటికే ఆమె వందకు పైగా పాటలు పాడింది. సినిమాల్లో ఐటెం సాంగ్స్ కు ఆమె పెట్టింది పేరుగా మారిపోయింది. కేవలం తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ ఇండస్ట్రీలో కూడా ఆమెకు అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇప్పుడు బోనాల సాంగ్స్ పాడుతోంది.