ఎస్పీ బాలసుబ్రమణ్యం కు నా వల్ల కరోనా రాలేదు : సింగర్ మాళవిక

Advertisement

ప్రముఖ లెజండరీ సింగర్ ఎస్పీ బాలసుబ్రమణ్యం కు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. అయితే బాలు కు కరోనా రావడానికి గల కారణం సింగర్ మాళవిక అని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఇక ఇలా వస్తున్న ప్రచారాన్ని స్పందించింది మాళవిక. అయితే రామోజీ ఫిలిం సిటీలో జూలై 30, 31వ తేదీలలో ఎస్పీ బాలసుబ్రమణ్యం స్పెషల్ ఎపిసోడ్స్ జరిగాయి. ఈ కార్యక్రమంలో జూలై 30న చాలా మంది సింగర్స్ పాల్గొన్నారు. అయితే మాళవిక మాత్రం 31 వ తేదీన పాల్గొన్న అని తెలిపింది. అలాగే ఈ కార్యక్రమానికి మాళవిక అన్ని జాగ్రత్తలు తీసుకోని వెళ్ళలేనని పేర్కొంది.

అయితే బాలు గారికి ఆగష్టు 5 వ తేదీన కరోనా సోకిందని తాను వీడియో ద్వారా వెల్లడించాడని తెలిపింది. ఇక ఆ షోలో పాల్గొన్నందుకు కరోనా టెస్టులు చేయించుకోగా, ఆగష్టు 8వ తేదీన కరోనా రిపోర్ట్ వచ్చిందని తెలిపింది. ఇక ఆ రిపోర్టులో పాజిటివ్ అని తేలిందని వివరించింది. అయితే ఆ షో కు ముందు కరోనా సోకె అవకాశం లేదని స్పష్టం చేసింది.

తన ఇంట్లో పెద్ద వాళ్లు, 5 నెలల పాప ఉందని దీంతో ఎంతో జాగ్రత్తగా వారిని చూసుకుంటూ 5 నెలలుగా ఇంట్లోనే ఉంటున్నాం అని తెలిపింది. తనకు కరోనా రావడంతో అమ్మ, నాన్న, పాపకి టెస్ట్ చేయిస్తే వారికి కూడా పాజిటివ్ వచ్చిందని చెప్పింది. అలాగే ప్రస్తుతం వారందరు కూడా హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారని పేర్కోంది. ఈ పరిస్థితుల్లో దయచేసి నా మీద అసత్య ప్రచారం చేయోద్దు అని ఆవేదన వ్యక్తం చేసింది. అలాగే తన గురించి ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళ వివరాలు సేకరించి సైబర్ క్రైమ్‌కి పిర్యాదు చేస్తానని మాళవికి వెల్లడించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here