Singer Chinmayi Sripada Video Posted By Social Media Viral : అతని చూపంతా ప్రైవేట్ పార్టుల పైనే.. సింగర్ చిన్మయి మరో సంచలనం..!

NQ Staff - July 15, 2023 / 10:19 AM IST

Singer Chinmayi Sripada Video Posted By Social Media Viral : అతని చూపంతా ప్రైవేట్ పార్టుల పైనే.. సింగర్ చిన్మయి మరో సంచలనం..!

Singer Chinmayi Sripada Video Posted By Social Media Viral :

సౌత్ స్టార్ సింగర్ చిన్మయి నిత్యం ఏదో ఒక వివాదం రాజేస్తూనే ఉంటుంది. ఆమె సింగర్ గా ఎంత ఫేమస్ అయిందో.. ఆరోపణలతో అంతకన్నా ఫేమస్ అయింది. మీటూ ఉద్యమంలో ఆమె కీలక పాత్ర పోషించింది. ఇప్పటికీ ఆమె ఏదో ఒక విషయాన్ని బయటకు తీస్తూనే ఉంటుంది. ఇక మీటూ ఉద్యమ సమయంలో తమిళ రచయిత వైరముత్తు మీద సంచలన ఆరోపణలు చేసింది.

కానీ ఆమె ఆరోపణలకు పెద్దగా ఆదరణ లభించలేదు. కాగా తాజాగా వైరముత్తు మీద మరో లేడీ సింగర్ ఆరోపణలు చేసింది. సింగర్ వినైతా ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలని చిన్మయి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఇంటర్వ్యూలో వినైతా మాట్లాడుతూ.. వైరముత్తు మీద చిన్మయి చేసిన ఆరోపణలు నిజమే.

అక్కడ మాత్రమే చూస్తాడు..

ఎందుకంటే వైరముత్తును కలిసినప్పుడు నాకు అనుభవం అయింది. ఆ వైరముత్తు అమ్మాయిల ముఖం చూసి మాట్లాడడు. కేవలం ప్రైవేట్ పార్టులు మాత్రమే చూస్తాడు. అతని చూపంతా అక్కడే ఉంటుంది. చాలా చీప్ గా బిహేవ్ చేస్తాడు. నా ప్లేస్ ఒకటి ఉంది. అక్కడకు రా మాట్లాడుకుందాం అంటాడు.

నా లాగా చాలామంది లేడీ సింగర్లు అతని వల్ల ఇబ్బందులు పడుతున్నారు అంటూ చెప్పుకొచ్చింది వినైతా. ఈ వీడియోను చిన్మయి ట్విట్టర్ లో పోస్టు చేసింది. ఇప్పటికైనా ఆ వైరముత్తు ఎలాంటి వ్యక్తి అనేది అర్థం చేసుకోండి అంటూ సంచలన కామెంట్లు చేసింది చిన్మయి.

 

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us