Singer Chinmayi :నొప్పి వస్తేనే, రక్తం కారితేనే వర్జిన్ కాదు.. చిన్మయి షాకింగ్ కామెంట్లు..!
NQ Staff - March 17, 2023 / 11:50 AM IST

Singer Chinmayi : సింగర్ చిన్మయి గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆమె సింగర్ గా ఎంత ఫేమస్సో వ్యక్తిగతంగా ఆమె చేసే కామెంట్లు, పనులతో కూడా అంతే ఫేమస్ అయింది. ఆమె ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. అంతే కాకుండా మహిళల విషయాలపై చాలానే ఫైట్ చేస్తుంది.
మహిళలు వ్యక్తిగతంగా ఎదుర్కునే ఇబ్బందులపై కూడా స్పందిస్తుంటుంది. ఇక తాజాగా సింగర్ చిన్మయి ఓ ఇన్ స్టా వీడియో చేసింది. ఇందులో దారుణంగా కామెంట్లు చేసింది. తొలి కలయిక మీదుండే అపోహల మీద ఆమె మాట్లాడింది. అమ్మాయిలకు తొలి కలయికలో నొప్పి వస్తేనో, లేదంటే రక్తం వస్తేనో వర్జిన్ అని అబ్బాయిలు భావిస్తుంటారు.
ట్రోల్ వీడియోను షేర్ చేస్తూ..
కానీ ఇందులో నిజం లేదు. రియాల్టీలో మాత్రం ఇలా ఉండదు. ఇవన్నీ కేవలం అపోహలు మాత్రమే అంటూ ఓ ట్రోల్ వీడియోను షేర్ చేసి ఆ విషయాన్ని చెప్పింది. పెండ్లి కొడుకులు ఆలోచన ఎలా ఉంటుందంటే.. వెజినా (యోని) టైట్‌గా ఉంటేనో, రక్తం కారితేనో, నొప్పి వస్తేనో వర్జిన్ అని అపోహ పడుతుంటారు.
ఒకవేళ టైట్ గా ఉండి, లేదంటే నొప్పి అమ్మాయిలకు బాగా నొప్పి వస్తుందంటే మాత్రం అది వైద్య పరంగా పెద్ద సమస్య అని గుర్తుంచుకోవాలి. వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. అమ్మాయిలు ఇలాంటి విషయాల గురించి మాట్లాడేందుకు పెద్దగా భయపడకూడదు అంటూ ధైర్యంగా చెప్పుకొచ్చింది చిన్మయి. పైగా ఇలాంటి విషయాలపై మాట్లాడితే సమాజం మనల్ని చిన్న చూపు చూస్తుందని చెబుతోంది చిన్మయి.