Siddharth: ఇప్పటికైన మారినందుకు సంతోషం.. సిద్ధార్థ్ క్షమాపణలపై సైనా కామెంట్
NQ Staff - January 13, 2022 / 03:02 PM IST

Siddharth: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్, హీరో సిద్ధార్థ్ మధ్య ట్వీట్స్ వార్ జరుగుతుంది. ఈ ఇద్దరి ఎపిసోడ్ దేశవ్యాప్తంగా హైలైట్ అయింది. సైనా చేసిన ఓ ట్వీట్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.మహిళలను కించపరిచాడంటూ ఆయనపై చాలా మంది ఆగ్రహం వ్యక్తం చేశారు.

Siddharth realised his mistake
సిద్ధార్థపై ఏకంగా జాతీయ మహిళా కమిషన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. సిద్ధార్థ ట్విట్టర్ ఖాతాను వెంటనే డిలీట్ చేయాలని ట్విట్టర్ ఇండియాకు లేఖ రాసింది. సైనా నెహ్వాల్‌పై అతడు అభ్యంతర కామెంట్స్ చేశాడని..ఈ కేసులో మహారాష్ట్ర డీజీపీ విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ ఛైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. సిద్ధార్ధ్ వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కూడా స్పందించారు.
సిద్ధార్థ్‌పై ముప్పేట్ దాడి జరగడంతో సిద్ధార్ధ్ వెంటనే తాను సైనా నెహ్వాల్ పై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణలు కోరారు. ఈ సందర్భంగా డియర్ సైనా.. నేను చేసిన ట్వీట్ ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. నాకు మహిళలంటే గౌరవం, మర్యాద ఉందన్నారు.
తను మహిళలను కించపరిచేలా చేయలేదని వివరిస్తూ.. జరిగిన దానికి క్షమాపణలు కోరుతూ ట్వీట్ చేశాడు. నా ట్వీట్‌లో లింగ సమానత్వాన్ని కించ పరిచేలా వ్యాఖ్యలు లేవని వివరణ ఇచ్చుకున్నారు. మొత్తంగా సిద్ధార్ధ్ క్షమాపణలు కోరడంతో ఈ వివాదానికి పులిస్టాప్ పడుతుందా అని ఎదురు చూస్తున్న క్రమంలో అతనిపై పోలీస్ కేసు కూడా నమోదైంది. హైదరాబాద్ పోలీసులు పలు సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.

Siddharth realised his mistake
అయితే సిద్ధార్థ సైనాకు క్షమాపణ చెప్పడాన్ని పలువురు ట్విట్టర్ ఖాతాదారులు స్వాగతిస్తున్నారు. అయితే సైనాకు సిద్దార్థ చేసిన ట్వీట్లో ఏముందో తెలియదంట. ఆ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో అసలు విషయం తెలిసిందంటోంది. ఇప్పటికైనా క్షమాపణ కోరి తన హుందాతనాన్ని కాపాడుకున్నాడని అంది. ఇటీవల అంతర్జాతీయ టోర్నీలతో పాటు లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సైనాను ప్రభుత్వం పద్మభూషణ్ తో సత్కరించిన విషయం తెలిసిందే.