Siddharth : ఆమెతో ఒకే ఇంట్లో ఉంటున్న సిద్దార్థ్.. పెండ్లి కాకుండానే ఆ పనులు..!
NQ Staff - January 27, 2023 / 11:46 AM IST

Siddharth : తమిళ హీరోల్లో చాలామంది లవర్ బాయ్స్ ఉన్నారు. అలాంటి వారిలో అందరికంటే ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం సిద్దార్థ్ గురించే. ఆయన హీరోగా అప్పట్లో ఓ ఊపు ఊపేశాడు. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అప్పట్లో యూత్ ఫుల్ సినిమాలతో బాగా క్రేజ్ సంపాదించుకున్నాడు ఈ హీరో. దాంతో యూత్‌కు ఆయన ఓ ఐకాన్ గా మారిపోయాడు.
అయితే సిద్దార్థ్ ఖాతాలో చాలామంది హీరోయిన్లు ఇప్పటికే బలైపోయారు. అందులో చూసుకుంటే త్రిష, హన్సిక, శృతిహాసన్, సమంత ఇలా చాలా పెద్ద లిస్టే ఉంది. ఇక ఆ తర్వాత ఓ అమ్మాయిని పెండ్లి చేసుకున్న ఆయన.. ఆ తర్వాత ఆమెకు విడాకులు కూడా ఇచ్చేశాడు. అప్పటి నుంచి కొన్ని రోజులు ఒంటరిగానే ఉన్నాడు.
ఆ పరిచయమే..

Siddharth Dating Aditi Rao Hydari
కానీ ఇప్పుడు మళ్లీ ఓ కొత్త అమ్మాయిని పట్టేశాడు. ఆమె ఎవరో కాదు అదితిరావు హైదరీ. మహాసముద్రం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య చనువు బాగా పెరిగి అది చివరకు సహజీవనంకు దారి తీసింది. దాంతో సిద్దార్థ్ ఆమెతో కలిసి చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్నాడు.
కాగా వీరిద్దరూ చెన్నైలోని ఒకే ఇంట్లో సహజీవనం చేస్తున్నారంట. ఈ విషయం ఇప్పుడు తమిళ మీడియలో బాగా వినిపిస్తోంది. నిన్న శర్వానంద్ ఎంగేజ్ మెంట్ కు కూడా వీరిద్దరూ కలిసి రావడం బాగా హైలెట్ అయింది. వీరిద్దరూ ఇప్పుడు డీప్ డేటింగ్ లో ఉన్నారు. మరి పెండ్లి చేసుకుంటారా లేదా అన్నది మాత్రం వేచి చూడాలి.