Siddharth: ఇండియాకి వ‌చ్చాను.. మ‌హాసముద్రం డబ్బింగ్ మొద‌లు పెడ‌తా

Siddharth: బొమ్మరిల్లు, నువ్వు వస్తానంటే నేనొద్దంటానా? చిత్రాలతో బ్లాక్‌బస్టర్‌ హిట్‌ను అందించిన సిద్ధార్థ్‌కు ఆ తర్వాత ఆశించిన సక్సెస్‌ రాలేదు. దీంతో తమిళంలో సినిమాలు చేస్తూ అక్కడ సెటిలైపోయాడు. ఈ క్రమంలో అక్కడ కూడా తన సినిమాలకు అంతగా గుర్తింపు రాకపోవడంతో కొంతకాలం బ్రేక్‌ ఇచ్చాడు. సుదీర్ఘ విరామం అనంతరం ‘మహా సముద్రం’ మూవీతో తిరిగి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు.

‘మహా సముంద్రం’ మూవీ షూటింగ్‌ సమయంలో యాక్షన్‌ సీన్స్‌ చేస్తుండగా సిద్దార్థ్‌ గాయపడినట్లు ఇటీవల ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ దర్శకడు అజయ్‌ భూపతి వెల్లడించిన సంగతి తెలిసిందే.ఫైట్ సీక్వెన్స్‌లో సిద్ధార్థ్‌ స్పైన్‌(వెన్నుముక)కు గాయమైంది. దీంతో సర్జరీ కోసం లండన్‌ వెళ్లిన సిద్దార్థ్‌ ఇటీవల తిరిగి ఇండియా వచ్చాడట. ఈ నేపథ్యంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ షేర్‌ చేస్తూ.. తాను ఇండియాకు తిరిగి వచ్చినట్లు చెప్పాడు. అంతేగాక ప్రస్తుతం హైదరాబాద్‌లో ‘మహా సముంద్రం’ సినిమాలో తన డబ్బింగ్‌ చెబుతున్నానని పేర్కొన్నాడు.

త‌న‌కు స్పైన్ జ‌రిగింద‌ని తెలియ‌జేసిన సిద్ధార్ధ్ ప్ర‌స్తుతం కోలుకుంటున్న‌ట్టు చెప్పాడు. డాక్టర్లు మరికొద్ది రోజులు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినట్లు తెలిపాడు. అలాగే తనకు ట్రీట్‌మెంట్‌ చేసిన డాక్టర్లు, ఫిజియోథెరపిస్టులకు ఈ సందర్భంగా సిద్దార్థ్‌ కృతజ్ఞతలు తెలిపాడు.

సిద్ధార్ద్ చాలా గ్యాప్ త‌ర్వాత న‌టించిన మహా సముంద్రం’ అక్టోబర్‌ 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కాబోతుంది. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై అనిల్ సుంకర నిర్మించారు.