Shubman Gill : సచిన్ కూతురుతో కాదు.. మరో అమ్మాయితో డేట్ కు వెళ్లిన శుభ్ మన్ గిల్..!
NQ Staff - June 7, 2023 / 11:50 AM IST

Shubman Gill : యంగ్ డ్యాషింగ్ క్రికెటర్ శుభ్ మన్ గిల్ గ్రౌండ్ లో ఎంత పవర్ ఫుల్ గా కనిపిస్తాడో అందరికీ తెలిసిందే. ఆయన చాలా త్వరగానే రికార్డులు కొల్లగొడుతున్నాడు. ఇప్పటికీ ఇండియా తరఫున్ ఎన్నో మ్యాచులు గెలిపించాడు. ఇక ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో కూడా గుజరాత్ తరఫున ఆడి ఫైనల్ వరకు వెళ్లడంతో కీ రోల్ పోషించాడు.
అయితే మనోడు క్రికెట్ రికార్డులతో మాత్రమే కాదు.. అమ్మాయిలతో డేటింగ్ విషయంలో కూడా హైలెట్ అవుతున్నాడు. ఆయన మొదట్లో సచిన్ టెండూల్కర్ కూతురు సారాతో డేటింగ్ చేస్తున్నాడంటూ వార్తలు వచ్చాయి. కానీ దీనిపై ఎవరూ స్పందించలేదు. ఆ తర్వాత సారా అలీఖాన్ తో డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్లు వచ్చాయి.

Shubman Gill Is Dating Niharika NM
అయితే రీసెంట్ గా వీరిద్దరూ ఒకరినొకరు సోషల్ మీడియాలో అన్ ఫాలో చేసుకున్నారు. తాజాగా వీరిద్దరినీ కాదని మరో అమ్మాయితో రొమాంటిక్ డేట్ కు వెళ్లాడు గిల్. ఆయన ప్రస్తుతం “స్పైడర్ మ్యాన్: ఇంటు ది స్పైడర్-వర్స్” యొక్క భారతీయ వెర్షన్‌కు డబ్బింగ్ చెబుతున్నాడు.

Shubman Gill Is Dating Niharika NM
ఈ మూవీ ప్రమోషన్ కోసం ఆయన తాజాగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ నిహారిక తో “రొమాంటిక్” డేట్‌కి వెళ్లాడు. ఈ వీడియోను నిహారిక తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ఇందులో వీరిద్దరూ చాలా సరసాలు ఆడుకుంటూ కనిపించారు. ఇద్దరు సారాలను కాదని మరో అమ్మాయికి ఛాన్స్ ఇచ్చావా గురూ అంటూ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.