Shubman-gill: కేకేఆర్‌తో ప్ర‌యాణం ముగిసిందంటూ ఎమోష‌న‌ల్ అయిన యువ క్రికెట‌ర్

Shubman-gill: భార‌త యువ బ్యాట్స్ మెన్ శుభ్‌మ‌న్ గిల్ ఇండియ‌న్ టీంలో ప‌లు ఆఫర్స్ అందుకొని మంచి రికార్డులు నెల‌కొల్పిన విష‌యం తెలిసిందే. అయితే ఐపీఎల్‌లోను శుభ్‌మ‌న్ గిల్ అద‌ర‌గొడుతున్నాడు. గిల్ 2018 నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో భాగస్వామ్యమయ్యాడు. చాలా విజయవంతమయ్యాడు. అయితే ఈసారి రెండుసార్లు విజేత గిల్‌ను మాత్రం నిలబెట్టుకోలేదు. అహ్మదాబాద్ టీంతో చేరాడు.

Shubman-gill
Shubman-gill

తాజా నిర్ణ‌యంతో గిల్, కోల్‌కతా మధ్య నాలుగేళ్ల అనుబంధం దూరమైంది. సునీల్ నరైన్, వెంకటేష్ అయ్యర్, ఆండ్రీ రస్సెల్, వరుణ్ చక్రవర్తిని రిటైన్ చేయాలని కోల్‌కతా నిర్ణయించింది. ప్రస్తుతం కొత్త జట్టు జెర్సీని ధరించేందుకు సిద్ధమైన గిల్ తన పాత జట్టుపై భావోద్వేగానికి గురయ్యాడు. గిల్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియోను పోస్ట్ చేశాడు, అందులో అతను KKRతో తన ప్రయాణాన్ని పంచుకున్నాడు.

ఈ వీడియోలో, అతను ఫ్రాంచైజీతో గడిపిన చాలా క్షణాలను కవర్ చేశాడు. గిల్ ఈ వీడియోలో మొదటి సీజన్ నుంచి చివరి సీజన్ వరకు అందులో పంచుకున్నాడు. గిల్ ఈ వీడియోతో పాటు చిన్న క్యాప్షన్ కూడా అందించాడు. గిల్ ఈ వీడియోతో “కోల్‌కతాతో ఓ కలలాంటి ప్రయాణం” అని వీడియో వదిలాడు.

కేకేఆర్‌తో ప్రయాణం.. పృథ్వీ షా కెప్టెన్సీలో 2018లో అండర్-19 ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకుంది. ఈ జట్టులో గిల్ కూడా ఉన్నాడు. ఈ ప్రపంచకప్ తర్వాత, గిల్‌ను రూ. 1.8 కోట్లకు కేకేఆర్ చేర్చుకుంది. ఈ ఏడాది అతని బేస్ ధర రూ. 20 లక్షలు. గిల్ తన ఐపీఎల్ కెరీర్‌లో మొత్తం 58 మ్యాచ్‌లు ఆడి 1417 పరుగులు చేశాడు. ఈ సమయంలో అతని స్ట్రైక్ రేట్ 123గా ఉంది. 2019లో, అతను లీగ్‌లో ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు.

Shubman-gill
Shubman-gill

గిల్ భారత్ తరఫున 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 558 పరుగులు చేశాడు. మూడు వన్డేలు కూడా ఆడాడు. ఈ మ్యాచ్‌ల్లో అతని బ్యాటింగ్‌లో 49 పరుగులు మాత్రమే వచ్చాయి.ఈ ఆటగాళ్లతో జతకట్టేందుకు సిద్ధం.. కొద్ది రోజుల క్రితం అహ్మదాబాద్ తన ముగ్గురు రిటైన్డ్ ఆటగాళ్లను ప్రకటించింది. ఇందులో ముంబై ఇండియన్స్‌లో ముఖ్యమైన సభ్యుడు హార్దిక్ పాండ్యా పేరును ఈ కొత్త ఫ్రాంచైజీ చేర్చింది. పాండ్యా జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.