Shruti Haasan Spoke About First Crush : లవర్ కంటే నాకు ఆ హీరో అంటేనే ఇష్టం.. శృతిహాసన్ మాటలు విన్నారా…!
NQ Staff - July 17, 2023 / 11:41 AM IST

Shruti Haasan Spoke About First Crush :
హాట్ బ్యూటీ శృతిహాసన్ అంటే ఇప్పుడు అందరికీ తెలుగు. ఆమె చాలా కాలంగా స్టార్ హీరోయిన్ గా రాణిస్తోంది. మొన్నటి వరకు సౌత్ లోని స్టార్ హీరోలందరినీ చుట్టేసింది. కానీ ఇప్పుడు ఎక్కువగా బాలీవుడ్ లోనే ఉంటుంది. ప్రస్తుతం స్టార్ హీరోలు ఆమెకు పెద్దగా ఛాన్సులు ఇవ్వట్లేదు. దాంతో ఆమె సీనియర్ హీరోలతో కూడా నటిస్తోంది.
ఇప్పటికే చిరంజీవి, బాలకృష్ణ లాంటి వారితో నటించింది. ప్రస్తుతం ప్రభాస్ సరసన సలార్ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా శృతిహాసన్ కు భారీ హిట్ అవుతుందని అంతా భావిస్తున్నారు. దీని తర్వాత ఆమెకు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు వస్తాయని చెబుతున్నారు. ఇక ప్రస్తుతం ఆమె ముంబైలోనే ఎక్కువగా ఉంటుంది.
ఒకే ఇంట్లో డేటింగ్..
తన ప్రియుడు శాంతాను హజారికతో కలిసి ఒకే ఇంట్లో డేటింగ్ చేస్తోంది. అయితే ఒక ఇంటర్వ్యూలో మాత్రం తన మొదటి క్రష్ ఎవరో చెప్పేసింది. హాలీవుడ్ హీరో బ్రూస్ లీ అంటే తనకు ఎంతో ఇష్టం అని వివరించింది. బ్రూస్ లీని సినిమాల్లోకి రాకముందు నుంచే చూస్తున్నాను.

Shruti Haasan Spoke About First Crush
అతను నటిస్తుంటే అలా చూస్తూ ఉండిపోతాను. అతను నాకు కాబోయే భర్త కన్నా ఎక్కువ ఇష్టం అంటూ స్టేట్ మెంట్ ఇచ్చేసింది ఈ ముద్దుగుమ్మ. ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఎంతైనా శృతిహాసన్ ఇలాంటి బోల్డ్ కామెంట్లు చేయడం ఇదేం కొత్త కాదు అంటున్నారు ఆమె అభిమానులు.