Shruti Haasan : మా అమ్మానాన్న విడిపోయినప్పుడు ఎంతో సంతోషించా.. శృతి హాసన్ షాకింగ్ వ్యాఖ్యలు?

Shruti Haasan : శృతి హాసన్.. మొదట తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ అని అనిపించుకున్న ఈ ముద్దు గుమ్మ తర్వాత తనను తాను నిరూపించుకొని.. ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా నిలిచింది. నిజానికి.. శృతి హాసన్ సినీ కుటుంబం నుంచి వచ్చినా.. తండ్రి కమల్ హాసన్ పేరును ఏమాత్రం వాడుకోకుండా.. తనకు తాను.. తన టాలెంట్ తో ఇండస్ట్రీలో నిలదొక్కుకుంది. ఇప్పటికీ తనకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు వస్తున్నాయి. తెలుగులో దాదాపు అందరు టాప్ హీరోలతో నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవలే వకీల్ సాబ్, క్రాక్ సినిమాలో మెరిసింది.

shruti haasan reveals about her parents
shruti haasan reveals about her parents

అయితే.. తన తండ్రి కమల్ హాసన్, తన తల్లి సారిక.. ఇద్దరూ తన చిన్నతనంలోనే విడిపోయిన విషయం తెలిసిందే. తనకు చెల్లి అక్షర కూడా ఉంది. తన చిన్నతనంలోనే.. కమల్, సారికలు విడిపోయారు. వాళ్ల పెళ్లి 1988లో జరగగా.. 2004 లో ఇద్దరి మధ్య కొన్ని విభేదాలు వచ్చి విడిపోయారు. వాళ్లు విడిపోయింది 2004 లో అయితే.. వాళ్లపై తాజాగా శృతి హాసన్ కామెంట్లు చేసింది.

shruti haasan reveals about her parents
shruti haasan reveals about her parents

తన పేరెంట్స్ విడిపోవడం నిజంగా తనకు సంతోషాన్ని ఇచ్చిందట. రోజూ గొడవ పెట్టుకొని.. సంతోషంగా ఉండకుండా.. బాధపడేకన్నా.. విడిపోయి ఎవరి జీవితం వాళ్లు హ్యాపీగా గడపడం మేలు కదా.. అని శృతి హాసన్ చెబుతోంది. అలాగే.. తన తల్లిదండ్రులు.. విడిపోయి.. ఇప్పుడు ఎవరి జీవితాన్ని వాళ్లు సంతోషంగా గడుపుతున్నారట. కలిసి బతకడం ఇష్టం లేనప్పుడు.. ఒక చోట ఉండటం కూడా కష్టమే. అందుకే.. వాళ్లు విడిపోయినప్పుడు నేను ఆనందించా. వాళ్లు విడిపోయాకే.. ఇద్దరూ మంచి తల్లిదండ్రులుగా మా ఆలన పాలన చూసుకున్నారు.. అని శృతి హాసన్ షాకింగ్ కామెంట్లు చేసింది.