Shriya Saran: శ్రియ ఇది దారుణం.. బిడ్డ పుట్టిన విష‌యాన్ని ఏడాది త‌ర్వాత చెబుతావా?

Shriya Saran: అందాల ముద్దుగుమ్మ శ్రియ తెలుగు ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని ఎంత‌గానో గెలుచుకుంది. ఈ ముద్దుగుమ్మ‌ని తెలుగు ప్రేక్ష‌కులు ఎంత‌గానో ఇష్ట‌ప‌డ‌తారు. దాదాపు టాలీవుడ్ స్టార్ హీరోలంద‌రితో క‌లిసి ప‌ని చేసిన శ్రియ పెళ్లి త‌ర్వాత సినిమాలు కాస్త త‌గ్గించింది. దాదాపు ఇరవై సంవత్సరాలుగా టాలీవుడ్ లో తనదైన అందం నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించిన ఈ ముద్దుగుమ్మ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీక‌ల పాత్ర పోషించింది.

తెలుగు తెరతో పాటు సౌత్ ఇండియా తెరలన్నింటినీ తన అందాలతో ఓ ఊపు ఊపేసిన శ్రియ.. స్టార్ హీరోలందరితో రొమాన్స్ చేసి సూపర్ డూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది. 2018లో రష్యన్‌ క్రీడాకారుడు, బిజినెస్‌ మ్యాన్‌ ఆండ్రీ కోషీవ్‌ను శ్రియ పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లి త‌ర్వాత వీరిద్ద‌రు క‌లిసి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. వీరి సంద‌డితో సోష‌ల్ మీడియా షేక్ అయింది.

అయితే గతేడాది వెకేషన్‌ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోయారు. ఆ స‌మ‌యంలో శ్రియ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. సంవత్సరం వరకు శ్రియ తన ప్రెగ్నెన్సీ గురించి బయటపెట్టకపోవడం గమనార్హం. తాజాగా త‌న సోష‌ల్ మీడియాలో అమ్మాయి పుట్టిన విష‌యాన్ని తెలియ‌జేసింది శ్రియ‌.

‘2020 ప్రపంచం మొత్తం తలకిందులు అయిపోయింది. ఒక ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయారు. కోవిడ్‌ కారణం‍గా అందరూ ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నారు. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. చిన్నారి రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఏంజిల్‌ లాంటి చిన్నారిని మాకు ప్రసాదించినందుకు ఆ దేవుడికి ఎంతో రుణపడి ఉంటాను అని పేర్కొంది శ్రియ‌.ఈ ముద్దుగుమ్మ‌కి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు.