Shriya Saran: ఇదెక్క‌డి దారుణం.. అంత మందిలో ఈ ముద్దుల ర‌చ్చేంది శ్రియ‌..!

Shriya Saran: అందాల ముద్దుగుమ్మ శ్రియ ఇటీవ‌లి కాలంలో తెగ ర‌చ్చ చేస్తుంది. 2018లో రష్యన్‌ క్రీడాకారుడు ఆండ్రీ కోషీవ్‌ను శ్రియ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఈ జంట ముంబైలో నివాసం ఉంటుంది. గతేడాది వెకేషన్‌ నిమిత్తం బోర్సిలోనాకు వెళ్లిన శ్రియ దంపతులు లాక్‌డౌన్‌ కారణంగా అక్కడే ఉండిపోయారు.

Shriya Saran

గతేడాది తాను పండంటి బిడ్డకు జన్మనిచ్చినట్లుగా శ్రియ రీసెంట్‌గా రివిల్ చేసింది. “2020 కరోనా సమయంలో ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఆ ఏడాదంతా అందరూ క్వారంటైన్‌లో ఉండిపోయి చాలా ఇబ్బందులు పడ్డారు.. కానీ మా జీవితంలో మాత్రం అద్భుతం జరిగింది. మా ఇంట్లోకి ఓ చిన్నారి వచ్చింది. ఆమె రాకతో మా ప్రపంచమే మారిపోయింది. ఈ చిన్నారిని ప్రసాదించినందుకు దేవుడికి ఎంతగానో రుణపడి ఉంటాము” అంటూ సోషల్ మీడియా వేదికగా శ్రియ పేర్కొంది.

కూతురికి రాధ అనే పేరు పెట్టిన‌ట్టు కూడా శ్రియ తెలియ‌జేసింది. కాగా, శ్రియ తన భర్తను ఇంత వరకు ప్రేక్షకుల ముందుకు తెర మీదకు తీసుకురాలేదు. కానీ మొదటిసారిగా భర్తతో కలిసి జీ తెలుగు ఈవెంట్‌లో కనిపించింది. అంగరంగ వైభవంగా జరగబోతోన్న జీ తెలుగు కుటుంబం అవార్డ్స్ వేడుకలో శ్రియ తన భర్త ఆండ్రూతో కలిసి తళుక్కున మెరిసింది.

ఇంగ్లీష్ తప్ప మరే భాష రాని ఆండ్రూ సైతం తెలుగులో మాట్లాడాడు. అందరికీ నమస్కారం అని చెప్పాడు. ఆ ఒక్క పదాన్ని బాగానే నేర్చుకున్నట్టున్నాడు. అయితే ఆండ్రూ అలా మాట్లాడటంతో శ్రియా షాక్ అయినట్టుంది. సోషల్ మీడియాలో ఎలా పోజులు పెడతారు అని ప్రదీప్ అనడంతో.. కొన్ని రొమాంటిక్ స్టిల్స్ పెట్టారు.

చివర్లో శ్రియ బుగ్గ మీద ఆండ్రూ ముద్దు పెట్టేశాడు. తానేమీ తక్కువ తిన్నానా? అన్నట్టుగా శ్రియా అయితే ఏకంగా ఇంగ్లీష్ కిస్ పెట్టేసింది. అలా పెదవికి పెదవితో ముద్దు పెట్టడంతో అక్కడకి వచ్చిన బుల్లితెర తారలు అవాక్కయ్యారు. ప్రస్తుతం శ్రియ తెలుగులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్నఆర్ఆర్ఆర్ లో కీలక పాత్ర పోషిస్తోంది. సినిమా పైన భారీ అంచనాలు నెలకొన్నాయి.