Shriya: భర్త మీదకు ఎక్కేసిన శ్రియా.. అందాల ఆరబోతలో పీక్స్

Shriya అందాల హీరోయిన్ శ్రియా సోషల్ మీడియాలో చేసే అల్లరి అంతా ఇంతా కాదు. భర్త్ ఆండ్రూ కొశ్చివ్‌తో కలిసి అల్లరి చేష్టలు తెగ వైరల్ అవుతుంటాయి. లాక్డౌన్ సమయంలో భర్తతో ఇంటి పనులు చేయిస్తూ తెగ ఆట పట్టించింది. భర్తను ఓ రేంజ్‌లో ఆడుకుంటూ నెటిజన్లకు వినోదాన్ని పంచింది. ఇక కరోనా జాగ్రత్తల పేరిట భర్తతో చేసిన ఫన్నీ వీడియోలు కూడా తెగ వైరల్ అయ్యాయి.

శ్రియాకు నిత్యం ట్రావెలింగ్ అంటే ఇష్టం. అలా ఎప్పుడూ కూడా భర్తతో కలిసి వెకేషన్స్‌కు వెళ్తుంటుంది. ఇప్పుడు శ్రియా మచ్చు పిచ్చు అంటూ భిన్న రకాల జంతువులను చూసేందుకు సిద్దమైంది. ఇందులో భాగంగా నిన్న కొన్ని వీడియోలను, ఫోటోలను శ్రియా షేర్ చేసింది. అందులో ఒక్కసారిగా శ్రియా మీదకు ఓ జంతువు వెళ్లింది. ఆ దెబ్బకు శ్రియా దడుసుకుంది. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోంది.

 

ఇక శ్రియా తన అందాలను ఆరబోస్తూ ఓ గుహలో చేసిన విన్యాసాలు కూడా బాగానే వైరల్ అయ్యాయి. లోపల బికినీ ధరించినా మీద ఓ పలుచటి డ్రెస్ ధరించి చేసిన డ్యాన్సులు, తిప్పిన వయ్యారాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక అనంతరం శ్రియా తన భర్తతో కలిసి దిగిన ఫోటోలు, ఇచ్చిన పోజులు తెగ వైరల్ అవుతున్నాయి.

భర్త మీదకు ఎక్కేసిన Shriya

భర్త మీద చిత్రవిచిత్రంగా ఎక్కేసింది శ్రియా. ఇప్పుడు ఈ ఫోటోలన్నీ కూడా నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. మొత్తానికి శ్రియా మాత్రం పెళ్లి తరువాతి జీవితాన్ని ఎంతో చక్కగా ఎంజాయ్ చేస్తోంది. మరో వైపు శ్రియా సినిమాలతోనూ బిజీగా ఉంది. కానీ తన పాత్రకు ప్రాధాన్యమున్న క్యారెక్టర్స్‌ను మాత్రమే ఎంచుకుంటోంది. ఆర్ఆర్ఆర్‌లో శ్రియా ఓ మెయిన్ క్యారెక్టర్‌ను పోషిస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement