Shraddha Walker : శ్రద్ధాని పూనావాలా చంపలేదట.! నరరూప రాక్షకుడికి న్యాయవాది సపోర్ట్.!
NQ Staff - November 23, 2022 / 08:31 AM IST

Shraddha Walker : అసలు ఇలాంటి కేసుల్ని న్యాయవాదులనేవారు ఎలా వాదిస్తారు.? అన్న చర్చ ప్రతిసారీ తెరపైకొస్తుంటుంది. గతంలో దేశం మీదకు దండెత్తిన టెర్రరిస్టు కసబ్ తరఫున న్యాయసహాయం అందించిన న్యాయవాది విషయంలో ఎంత వ్యతిరేకత వచ్చిందో చూశాం. నిర్భయ కేసులోనూ అంతే.
తాజాగా, ఢిల్లీలో వెలుగు చూసిన అత్యంత కిరాతకమైన హత్యకు సంబంధించి నిందితుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలాకి మద్దతుగా రంగంలోకి దిగిన న్యాయవాది అభిషేక్ కుమార్ పైనా తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముంబైకి చెందిన యువతి శ్రద్ధాని ప్రేమ పేరుతో వంచించి, ఆమెతో సహజీవనం చేసి.. అత్యంత కిరాతకంగా ఆమెను పూనావాలా చంపేసిన సంగతి తెలిసిందే.
పూనావాలా అమాయకుడట..
పూనావాలాతో తాను మాట్లాడాననీ, తాను తప్పు చేయలేదని ధైర్యంగా చెబుతున్నాడని న్యాయవాది కుమార్ చెబుతున్నారు. పోలీసులు బలవంతంగా అతన్ని దోషిని చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్నది న్యాయవాది కుమార్ ఆరోపణ.
వాస్తవానికి పూనావాలా కుటుంబం చాలా భయపడుతోందని కుమార్ అంటుండడం గమనార్హం. మరి, హత్యకు గురైన శ్రద్ధాకి న్యాయం జరిగేదెలా.? ఆమె కుటుంబానికి కలిగిన శోకానికి కారణమెవరు.? చంపేసి, ముక్కలుగా నరికేసి, ఇంట్లోనే ఫ్రిజ్‌లో ఆ శరీర భాగాల్ని దాచిన పూనావాలా ఎలా అమాయకుడవుతాడు.?