America : అమెరికా చికాగోలో తెలంగాణ విద్యార్థిపై కాల్పులు
NQ Staff - January 23, 2023 / 06:41 PM IST

America : అమెరికాలో మరోసారి తుపాకీల మోత మోగింది. ఈసారి తెలంగాణ విద్యార్థి పై కాల్పులు జరగడం సంచలనంగా మారింది. తెలంగాణ చెందిన సాయి చరణ్ తో పాటు మరొకరికి ఈ కాల్పుల్లో గాయాలైనట్లుగా సమాచారం అందుతుంది.
ఇద్దరి శరీరంలోకి బుల్లెట్లు దూసుకు వెళ్ళాయని స్థానిక మీడియా కథనాల ద్వారా సమాచారం అందుతోంది. కాల్పులకు కారణం ఏంటీ అనే విషయమై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారట. త్వరలోనే పోలీసులు కాల్పులకు సంబంధించిన ప్రకటన చేసే అవకాశం ఉంది.
ప్రస్తుతం ఇద్దరు కూడా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి పై మరికాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే సాయిచరణ్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారు సాయి చరణ్ యొక్క ఆరోగ్య పరిస్థితి పై ఆందోళనలతో ఉన్నారట.
భారీ ఎత్తున అమెరికాలో కాల్పులు జరగడం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము. ఎంత జాగ్రత్తగా ఉంటున్నా కూడా ఏదో ఒక సమయంలో ఇండియాకు చెందిన లేదా మన తెలుగు వారు కాల్పులకు గురి అవ్వాల్సి వస్తోంది. అమెరికాలో గన్ కల్చర్ కి చరమ గీతం పాడేందుకు ప్రస్తుత ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది. అయినా కూడా ఎక్కువ శాతం మంది గన్ వాడుతూ కాల్పులు జరుపుతున్నారు.