Khushi Movie : ఈ ఏడాది సమంతకి ‘ఖుషీ’ లేనట్టేనా? ఫైటర్‌గా సూపరే.. స్టార్ గా సక్సెస్ సంగతేంటి మరి?
NQ Staff - November 13, 2022 / 12:11 PM IST

Khushi Movie : టాలీవుడ్ లో లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు రాక చాలా రోజులవుతుండడం, సమంతలాంటి స్టార్ హీరోయిన్ సరోగసీ బ్యాక్‌డ్రాప్ మూవీలో యాక్ట్ చేయడంతో యశోద మూవీ అనౌన్సయిన నాటినుంచే హైప్ క్రియేటయింది. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్ గానీ, ఒక్క సినిమా ఫంక్షన్ కూడా చేయకపోయినా ఓపెనింగ్స్ ఓ రేంజులోనే వచ్చి సౌత్ లో సామ్ రేంజ్ అండ్ క్రేజ్ ఏంటో ప్రూవయింది.
పర్సనల్ లైఫ్‌లోని ఇన్సిడెంట్స్, హెల్త్ ఇష్యూస్‌తో స్ట్రగుల్ అవుతున్నా కెరీర్లో దూసుకు పోతుండడంతో ట్రూ ఫైటర్‌గా ప్రశంసలు దక్కించుకుంటోంది కూడా. తీరా యశోద రిలీజయ్యాక మరీ బ్లాక్‌బస్టర్ టాక్ అయితే దక్కలేదు. మల్టిపుల్ లాంగ్వేజెస్‌లో విడుదలై మిక్స్డ్ టాక్‌తో థియేటర్స్‌లో రన్ అవుతుంది. యాక్షన్ సీన్స్‌లో తన పర్ఫామెన్సుకి మంచి మార్కులే పడ్డా సోసో హిట్టే అనిపించు కుంది.
కొన్నాళ్లుగా ఓ బడా హిట్ లేక బాధపడుతున్న సమంత యశోద మీద బానే ఆశలు పెట్టుకుంది. కానీ ఆమె ఆశించిన స్థాయిలో యశోదకి భారీ రెస్పాన్స్ దక్కక పోవడంతో ఖుషీ మూవీతో అయినా ఈ ఏడాది సూపర్ సక్సెస్ సాధించాలనుకుంది. శివ నిర్వాణ డైరెక్షన్లో విజయ్ దేవరకొండకు జోడీగా సామ్ నటిస్తున్న ఆ మూవీ క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23 న రిలీజ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు. కానీ పరిస్థితి చూస్తుంటే అనుకున్న టైమ్‌కి ఆడియెన్స్ ముందుకొచ్చేలా లేదు మూవీ.
సమంత ఆరోగ్యం పూర్తిగా కుదుటపడి, మళ్లీ నార్మల్‌గా ఎప్పటి లాగే షూటింగుకి వెళ్లడానికి ఇంకా టైమ్ పట్టేలా ఉందట. పైగా సినిమా కాశ్మీర్ బ్యాక్ డ్రాప్ కావడం, ఆ లోకేషన్స్‌లోనే చాలా సీన్స్ షూట్ చేయాల్సిరావడంతో తన హెల్త్ దృష్ట్యా ఇప్పట్లో ఆ షెడ్యూల్‌ని కంప్లీట్ చేయడం ప్రాక్టికల్ గా వర్కవుట్ అయ్యేలా లేదట.
నిజానికి ఖుషీ మూవీ ఓ రకంగా విజయ్ దేవరకొండకి, సమంతకి, దర్శకుడు శివ నిర్వాణకి కూడా ప్రెస్టేజియస్ ప్రాజెక్టే. ఎందుకంటే ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన లైగర్ ఏ మాత్రం ఊహించని రీతిలో బడా డిజాస్టరయింది. మరోవైపు నాని హీరోగా శివ నిర్వాణ డైరెక్ట్ చేసిన టక్ జగదీష్ కూడా ఫ్లాప్ టాక్‌నే మూట గట్టుకుంది. నిన్నుకోరి చిత్రంతో తనకి డెబ్యూ డైరెక్టర్ గా ఛాన్సిచ్చిన న్యాచురల్ స్టార్‌కి కెరీర్లోనే మర్చిపోలేని ఓ ఫ్లాపిచ్చాడంటూ నెగిటివ్ కామెంట్స్ కూడా గట్టిగానే వచ్చాయి.
ఇక సమంత నటించిన గత చిత్రాలు జాను, krk కూడా మినిమమ్ హిట్ అనిపించుకోలేక పోయాయి. దాంతో ఖుషీ మూవీతో సక్సెస్ కొట్టి సౌత్ వైడ్‌గా నాలుగు భాషల్లోనూ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలను కున్నారు. కానీ సమంత కారణంగా సినిమా షూట్ ఆలస్యమై ఖుషీ రిలీజవడానికి ఇంకాస్త టైమ్ పట్టి హీరో అండ్ డైరెక్టర్ కూడా ఇబ్బంది పడే పరిస్థితొచ్చింది పాపం.
మరి అన్నీ మళ్లీ నార్మలయి, షూట్ కంటిన్యూ అయి సమంత, ఆమెతో పాటు ఆమె ఒప్పుకున్న ప్రాజెక్ట్స్ టీమంతా ‘ఖుషీ’ అయ్యేదెప్పుడో చూడాలిక.