Toilet: టాయిలెట్ అద్దెకి ఇవ్వ‌బ‌డును..రెంట్ తెలిసి షాక‌వుతున్న నెటిజ‌న్స్

Toilet: ఖాళీగా ఉంటే ఇళ్లు, బంగ్లాలు లాంటివి అద్దెకు ఇస్తారు. కాని ఓ ప్ర‌బుద్ధుడు ఏకంగా టాయిలెట్‌ని అద్దెకు ఇవ్వాల‌ని చూశాడు.ఆ టాయిలెట్‌ని ఆఫీసు అవ‌స‌రాల కోసం వాడుకోండ‌ని ఉచిత స‌ల‌హాలు కూడా ఇచ్చాడు. ఆన్‌లైన్‌లో దీనికి సంబంధించిన ప్ర‌క‌ట‌న ఇవ్వ‌గా, నెటిజ‌న్స్ అత‌నిపై మండిప‌డ‌డంతో వెంట‌నే తొల‌గించాడు.

TheNewsQube-

Shocking Truths behind the Toilet Rent
Shocking Truths behind the Toilet Rent

వివ‌రాల‌లోకి వెళితే స్కాట్‌లాండ్‌, గ్లాస్గోలోని పాట్రిక్‌కు చెందిన ఓ వ్యక్తి గమ్‌ట్రీ అనే ప్రాపర్టీ సైట్‌లో కొద్దిరోజుల క్రితం ఓ ప్రకటన ఇచ్చాడు. తన అపార్ట్‌మెంట్‌ బిల్డింగ్‌లోని ఫస్ట్‌ ఫ్లోర్‌లో టాయిలెట్ ఉంద‌ని , దానిని అద్దెకు ఇవ్వాల‌నుకుంటున్నట్టు చెప్పాడు. ఇందులో వైఫై, రిఫ్రిజిరేటర్‌, టీ కెటిల్‌, బల్ల, కుర్చీ ఇలా కొన్ని రకాల వ‌స‌తులు కూడా ఉంటాయ‌ని తెలియ‌జేశాడు.

ఇది ఆఫీసుకి అనుకూలంగా ఉంటుంద‌ని చెప్పిన ఆయ‌న దాని రెంట్ వారానికి 50 స్టెర్లింగ్‌ పౌండ్‌లు(5,070 రూపాయలు) గా ఫిక్స్ చేశాడు.తాను సోమవారం-శుక్రవారం.. ఉదయం 8 గంటలనుంచి సాయంత్రం 6 వరకు అందుబాటులో ఉంటానని, ఎక్కువ కాలానికి అద్దెకు తీసుకునే వాళ్లకు తాళం చెవులు కూడా ఇస్తానన్నాడు.

ఈ విచిత్ర ప్ర‌క‌ట‌న‌ని చూసి ఒక్క‌సారిగా బిత్త‌ర‌పోయారు. త‌ర్వాత షాక్ నుండి కోలుకొని స‌ద‌రు వ్యక్తిపై ఫైర్ అయ్యారు. అస‌లు టాయిలెట్‌ను అద్దెకివ్వటమేంటి.. దానికి 50 స్టెర్లింగ్‌ పౌండ్‌ల అద్దేంటని మండిపడ్డారు. నెటిజ‌న్స్ ఆయ‌న‌పై ఫుల్ ఫైర్ అవుతుండ‌డంతో వెంట‌నే ఆ పోస్ట్‌ని తొల‌గించారు.