కే‌సి‌ఆర్ కి అందిన షాకింగ్ రిపోర్ట్ : వణుకుతున్న టి‌ఆర్‌ఎస్ శ్రేణులు ?

హైదరాబాద్ లో జరిగే గ్రేటర్ ఎన్నికలలో రాజకీయా పార్టీల మధ్య నువ్వా.. నేనా అన్నట్లు సమరం జరుగుతుంది. అయితే ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు తీరు చూస్తుంటే కేసీఆర్ కి నిజంగానే షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్నికల ప్రక్రియ జరుగుతున్న విధానంపై కేసీఆర్ చేయించుకున్న సర్వే ప్రకారం ఈ ఎన్నికలు ఆయనకు షాక్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. అధికార పక్షం ఎన్నికల నేపథ్యంలో అందరికన్నా ముందుగానే అభ్యర్ధులను సెట్ చేసుకోవడం, వాటికి ఇన్చార్జులను నియమించటం, మంత్రులు, ఎంఎల్ఏ లతో ప్రచారం చేయించటం, గెలుపు బాధ్యతలు కేటీయార్ కు అప్పగించటం లాంటివి ఎంత పక్కగా చేసినా గాని లాభం లేకపోయిందని కేసీఆర్ కు అర్ధమైందట. రోజులు గడిచేకొద్దీ తాను రచించిన వ్యూహం రివర్స్ అవుతున్నట్లు కేసీఆర్ కు స్పష్టంగా తెలిసిపోతందట. అసలు విషయం ఏమిటంటే..

150 డివిజన్లలో తమ పార్టీనే సెంచిరీ దాటాలని కేసీఆర్ టార్గెట్ గాపెట్టుకున్నారు. అయితే సర్వే ప్రకారం సెంచిరీ మాట దేవుడెరుగు, అసలు కనీసం 150 డివిజన్లలో సగం అభ్యర్ధులు గెలిచినా చాలా ఎక్కువే అన్నట్లుగా ఉందట క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు. చాలా డివిజన్లలో బరిలో ఉన్న అభ్యర్ధులకు, ఎంఎల్ఏ లకు పడటంలేదట. అందుకనే కొందరు ఎంఎల్ఏ లు తమ అభ్యర్ధుల గెలుపుకు ఏమాత్రం సహకరించడం లేదట. అంతేకాకుండా ఆ అభ్యర్ధుల మీద ఉన్న కోపంతో, వాళ్ళకి వ్యతిరేకంగా పోటీచేస్తున్న ఇతరుల గెలుపు కోసం కృషి చేస్తున్నారట. ఇంకా కొన్ని డివిజన్లలో మంత్రులకు-ఎంఎల్ఏల అభ్యర్ధులకు మధ్య సమన్వయం ఉండటం లేదట. దాంతో అసలు విషయం ఏమిటో తెలుసుకుందామని కేసీఆర్ సర్వే చేయించినట్లు సమాచారం.

ఆ సర్వే నేపథ్యంలోనే ఒక ప్రత్యేక బృందం మూడు రోజుల పాటు డివిజిన్లలో తిరిగి ఇచ్చిన సర్వే రిపోర్టులో షాకింగ్ వివరాలు బయటపడ్డాయట. అంతర్గతంగా పెరుగుతున్న వివాదాలు, సమన్వయ లేమి కారణంగా కనీసం 30 డివిజన్లలో గెలుపు కష్టమని బయటపడిందట. అయితే సీఎంకు అందించిన రిపోర్టును బట్టి 30 డివిజన్లలో కష్టమని చెప్పారే కానీ వాస్తవానికి అంతకన్నా ఎక్కువ డివిజన్లలోనే టీఆర్ఎస్ నష్టపోవటం ఖాయమని క్షేత్రస్ధాయి వర్గాలు అనుకుంటున్నారు. తమ పార్టీలోని అభ్యర్థుల మధ్య ఈ అంతర్గత గొడవలు వల్ల వాళ్ళు మాత్రమే కాదు.. పార్టీ పరువుతో పాటు, పార్టీ కూడా నష్ట పోతుందని కేసీఆర్ ఆందోళనలో ఉన్నారట.

Advertisement