కరోనా విషయంలో వణుకుపుట్టే నిజాలు బయట పెట్టున ఆరోగ్య సంస్థలు

Advertisement

కరోనా ఈ పేరు వింటే చాలు ప్రస్తుతం ప్రతి ఒక్కరికి గుబులు పుడుతుంది. ఎంతటి పాజిటివ్ మైండ్ ఉన్నవారు అయినా సరే కరోనా విషయంలో మాత్రం పాజిటివ్ వస్తే ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఈ కరోనా మహమ్మారి చిన్న, పెద్ద, పేద, ధనిక అని తేడా లేకుండా అందరికి సోకుతుంది.

వంద మంది హీరోలను ఒంటి చేతితో మట్టి కరిపించిన సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ తో సహా తన కుటుంబం మొత్తం కూడా కరోనా బారిన పడింది.అమితాబ్ కరోనా కి ప్రజలను చైతన్య పరిచే కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్. ఇక తనకు కరోనా గురించి తెలియనిది ఏం ఉండదు. దేశంలో లాక్ డౌన్ విధించినప్పటి నుండి ఏకాంతంలో ఉంటున్నాడు. అయినా కూడా ఈ కరోనా అమితాబ్ ను వదలలేదు.

ఇక దీన్ని బట్టి చూస్తే కరోనా ఎవ్వరిని వదిలిపెట్టేలా లేదు. చాలా వరకు ప్రజలు కరోనా భయం పోయినట్టే ఇష్ట రాజ్యాంగా రోడ్ల మీద తిరుగుతున్నారు. ఇప్పటికే కరోనా దెబ్బకు మూతికి మాస్కులు మరియు చేతులకు శానిటైజర్ లతో బ్రతకలిసిన పరిస్థితి ఏర్పడింది. చాలా వరకు భౌతిక దూరం పాటిస్తూ బ్రతుకుతున్నాం. మనకు ఎంత దగ్గరి వారైనా సరే వాళ్ళతో మాట్లాడాలంటే భయం గా మారింది.

ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకినా వారిలో హాలీవుడ్, బాలీవుడ్, సినీ నటులు, అధ్యక్షులు, అధినేతలు, రాజులు ,రాణులు, మంత్రులు అందరు కూడా కరోనా బారిన పడి చాలా వరకు కోలుకున్నారు. దాంట్లో ఒకరిద్దరు ప్రాణాలు కూడా కోల్పోయారు. ఇక మన దేశంలో సినిమా నటులను మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు, స్పీకర్లు మరియు వారి కుటుంబ సభ్యులు అని తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడ్డారు. చికిత్స తీసుకోని కోలుకున్నారు.

ఈ పరిమాణాలు చూస్తుంటే మన లాంటి సాధారమైన ప్రజలు కూడా ఏదో ఒకరోజు ఈ కరోనా బారిన పడే అవకాశం ఉందని స్పష్టంగా కనిపిస్తుంది. ఇక కరోనా సోకితే అమ్మో అని భయపడటం మానేసి అది ఎలా తగ్గాలో అనే దాని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here