Choreographer Rakesh Master : ఆ వేపచెట్టు కిందే సమాధి చేయండి.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్..!

NQ Staff - June 19, 2023 / 10:03 AM IST

Choreographer Rakesh Master : ఆ వేపచెట్టు కిందే సమాధి చేయండి.. ముందే చెప్పిన రాకేష్ మాస్టర్..!

Choreographer Rakesh Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ నిన్న అకాల మరణం చెందారు. గత వారం రోజులుగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. నిన్న సడెన్ గా రక్త విరోచనాలు కావడంతో గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. సాయంత్రం 5గంటల సమయంలో ఆయన మరణించారు. దాంతో ఆయనకు సంబంధించిన అనేక విషయాలు సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు ఆయన అభిమానులు.

ఇక గతంలో ఆయన ఓ ఇంటర్వ్యూలో చెప్పిన వీడియోను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు ఆయన అభిమానులు. అందులో ఆయన మాట్లాడుతూ.. నా అనుకున్న వారందరినీ నేను కోల్పోయాను. నాకు నా తమ్ముడంటే చాలా ఇష్టం. అతను చనిపోయినప్పుడు నేను ఎంత బాధపడ్డానో నాకు మాత్రమే తెలుసు.

ఆ తర్వాత మా అమ్మ చనిపోయింది. అక్క, ఆమె కొడుకు కూడా చనిపోయారు. దాంతో జీవితం మీదే చాలా విరక్తి పుట్టింది. కానీ అప్పటి నుంచి నాకు మా బంధువుల నుంచి ఫోన్ వస్తే ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనే భయం వేసేది. నాకు జీవితం మీద పెద్దగా ఆశలేదు. ఎన్ని రోజులు ఉన్నా సరే మట్టిలో కలిసిపోవాల్సిందే.

నా భార్య తండ్రి(మామ) సమాధి పక్కన నేను ఓ వేప చెట్టు పెంచుతున్నాను. నేను చనిపోతే నన్ను ఆ వేపచెట్టు కిందనే సమాధి చేయండి అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చాడు రాకేష్ మాస్టర్. మరి ఇప్పుడు ఆయన కోరిక మేరకు అదే వేపచెట్టు కింద సమాధి చేస్తారా లేకపోతే వేరే చోట చేస్తారా అనేది మాత్రం చూడాలి.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us