మోడీకి మొదటి ఎదురుదెబ్బ … సోషల్ మీడియాలో ..

Advertisement

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ మాటలు వినిపించే రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్’ కు యూట్యూబ్ లో డిస్‌లైక్‌ ల్లో రికార్డు సృష్టించింది. భారతీయ జనతా పార్టీ కి చెందిన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోను ప్రసారం చేయగా, పెట్టిన 24 గంటల్లోనే అత్యధికంగా డిస్‌లైక్ చేసిన వీడియోల్లో ఒకటిగా ఈ వీడియో నిలిచింది. అయితే నరేంద్ర మోడీ జాతిని ఉద్దేశించి ఆదివారం రేడియో ప్రసారం ద్వారా ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్నీ వినిపించిన సంగతి అందరికి తెలిసిందే. ఇక ఈ కార్యక్రమంలో మోడీ మన దేశీయ కుక్కలను మాత్రమే పెంచుకోవాలని చెప్పాడు.

అలాగే ఆట బొమ్మలను కూడా మన దేశంలోనే తయారు చేసుకోవాలని కొనియాడారు. కానీ ఈ కార్యక్రమంలో విద్యకు సంబందించిన జేఈఈ, నీట్ పరీక్షల గురించి మోడీ మాట్లాడకపోవడంతో చాలా మంది ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక మొత్తం మీద ఈ వీడియోను 18 లక్షల మందికి పైగా వీక్షించారు. దాంట్లో 74 వేల మంది ఆ వీడియోను లైక్ చేశారు. ఇక 5 లక్షల మంది డిస్‌లైక్ చేసి అత్యధిక డిష్ లైక్ చేసిన వీడియోల జాబితాలో ఈ వీడియోను కూడా చేసారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here