రూ. 2.2 కోట్లు పెట్టి కొన్న సినిమా లోకల్ ఛానల్ లో టెలీకాస్ట్.. భారీ ఫైన్ తో షాకిచ్చిన ఈ టీవీ

Advertisement

సినీ ఇండస్ట్రీలో నిర్మాతలు కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తుంటే, ఇక ఆ సినిమాలను ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టి టీవీ ఛానల్స్, స్ట్రీమింగ్ రైట్స్, హిందీ డబ్బింగ్ రైట్స్ వాళ్ళు కొంటున్నారు. ఇక లాంగ్ రన్ లో లాభాలు సొంతం చేసుకుంటారో లేదో అన్న డౌట్ లో ఉంటె ఒకవైపు సినిమా మాస్టర్ ప్రింట్ వచ్చింది. ఇక ఆలస్యం చేయకుండా లోకల్ ఛానెల్స్ మాత్రం ఇవేవి పట్టించు కోకుండా ఆ సినిమాలను తమ లోకల్ ఛానెల్స్ లో వరుస పెట్టి టెలికాస్ట్ చేస్తూనే ఉంటారు.

ఇన్ని రోజులు సినిమా రిలీస్ అయ్యాక కొన్ని రోజుల తరువాత మాస్టర్ ప్రింట్స్ వస్తే లోకల్ ఛానెళ్లు టెలికాస్ట్ చేసేవి. ఇక ఆలా టెలికాస్ట్ చేస్తే ఎవరు కూడా పెద్దగా పెట్టించుకునేది కాదు. అయితే ప్రస్తుతం డిజిటల్ రిలీజ్ అవుతున్న సినిమాల ప్రింట్స్ మొదటి రోజే హెచ్ డి లో రిలీజ్ చేస్తున్నారు. ఇక వాటిని కూడా కొన్ని లోకల్ ఛానెల్స్ ప్రసారం చేస్తున్నాయి. తాజాగా ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమా విషయం లో ఇదే జరిగింది. ఇక ఈ సినిమాను హైదరాబాద్ కి చెందిన ఓ లోకల్ ఛానెల్ ప్రసారం చేసింది.

ఇక లోకల్ ఛానల్ లో చుసిన కొందరు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ని 2.2 కోట్ల రేంజ్ రేటు కి కొన్న ఈటీవీ కి చెప్పడంతో త్వరలో టెలివిజన్ లో టెలికాస్ట్ చేయడానికి సిద్ధం అవుతున్న టైం లో ఇలా ఇల్లీగల్ గా టెలికాస్ట్ చేయడంతో మండిపోయి ఆ లోకల్ ఛానల్ మీద ఏకంగా 1 కోటి రూపాయలు ఫైన్ కట్టండి అంటూ నోటీసులు పంపింది. ఇక దీనితో భయపడిన ఆ ఛానల్ ఇంకా ఎప్పుడు ఇలా చేయము అని బ్రతిమిలాడింది. దీనితో వదిలిపెట్టారు. ఇంకోసారి ఇలాంటివి జరిగితే ఊరుకునేది లేదని హెచ్చరించింది. ఇక ఈ దెబ్బతో లోకల్ ఛానల్స్ కొద్దీ రోజులు తరువాత మాత్రమే ప్రసారం చేసే అవకాశాలు ఉన్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here