వర్మ మర్డర్ సినిమాకు షాక్

Advertisement

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ రూపొందిస్తున్న మర్డర్ సినిమాకు షాక్ తగిలింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన కేసు విచారణను నల్గొండలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు పూర్తి చేసి కీలక తీర్పును వెల్లడించింది. అయితే మర్డర్‌ సినిమాను నిలిపివేయాలని నల్గొండ జిల్లా కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేసిన ఓ ఫోటోతో ఈ దుమారం మొదలు అయింది. ఓ తండ్రి తన కూతురును అతిగా ప్రేమిస్తే ఎంత ప్రమాదమో తెలిపే అమృత, మారుతీరావు కథతో తెరకెక్కించబోతున్న ఈ చిత్రం ప్రతిఒక్కరి హృదయాలను కలిచి వేస్తుంది. ఈ ఫిల్మ్ పోస్టర్‌ను ఫాదర్స్ డే రోజున విడుదల చేస్తున్నా’ అని వర్మ ఓ ట్వీట్ చేశారు.

ఆ తరువాత ఈ విషయానికి అమృత స్పందించారంటూ సోషల్‌ మీడియాలో ఓ వార్త హల్‌చల్‌ చేసింది. దీనికి వర్మ స్పందిస్తూ.. చెడుగా చూపించడానికి నేను ఈ సినిమాను తీస్తున్నాను అనుకోవడం సరైన పద్దతి కాదు. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా చెడ్డ వాడు కాదని నేను చాలా నమ్ముతాను. ఏ వ్యక్తిని అయిన కొన్ని ప్రతికూల పరిస్థితులు వల్ల చెడ్డ వాడిని చేస్తాయి. ఇక ఈ విషయాలనే నేను ‘మర్డర్’ సినిమాలో చూపించాలని అనుకుంటున్నాను అని ఈ సినిమా గురించి మొదట్లో వెల్లడించారు. ఇక నల్గొండ కోర్టు తీరుతో మిర్యాలగూడ అమృత, ప్రణయ్,​ మారుతీరావు ఘటన పై రామ్​గోపాల్​వర్మ సినిమా చివరికి ఈ విధంగా ముగిసింది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here