Shoaib Malik And Sania Mirza : కన్ఫ్యూజన్ : వీరిద్దరు కలిసే ఉన్నారా? విడిపోయారా?
NQ Staff - January 28, 2023 / 02:07 PM IST

Shoaib Malik And Sania Mirza : భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మరియు పాకిస్తాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కొన్ని సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నారు. వీరికి బాబు కూడా ఉన్నాడు. అయితే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ గత కొన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది.
ఇద్దరూ విడాకులు తీసుకున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. ఆ మధ్య సానియా మీర్జా తాను ఒంటరి అన్నట్లుగా అర్థం వచ్చే కొన్ని పోస్ట్ లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడం జరిగింది. దాంతో చాలా మంది ఈమె విడాకులు తీసుకుంటుందని నమ్ముతున్నారు.
కానీ తాజాగా ఆమె భర్త సోయబ్ మాలిక్ సోషల్ మీడియా ద్వారా సానియా మీర్జా గురించి ఆసక్తికర పోస్ట్ ను షేర్ చేశాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్ డ్ డబుల్స్ లో రోహన్ బొప్పన్నతో కలిసి ఆడిన సానియా మీర్జా రన్నర్ ఆఫ్ గా నిలిచింది.
ఇదే సానియా మీర్జాకు చివరి టోర్నమెంట్. ఆ టోర్నమెంట్ లో రన్నర్ ఆఫ్ గా సానియా మీర్జా నిలవడంతో ఆమె అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సానియా మీర్జా పై ప్రశంసలు కురిపించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో నీ ఆట తీరి చూసి గర్వపడుతున్నానని పేర్కొన్నాడు.
క్రీడా ప్రపంచంలో మహిళలకు నీవు ఒక ఆశా కిరణం, స్ఫూర్తిదాయకం అంటూ ప్రశంసించాడు. నీవు కెరియర్ లో సాధించిన ఎన్నో విజయాలకు నేను గర్విస్తున్నాను అని కూడా పేర్కొన్నాడు. ఆయన ట్వీట్ చూస్తూ ఉంటే ఇద్దరు ఇంకా కలిసే ఉన్నారేమో అనిపిస్తుంది. మరి ఆ వార్తలు ఎందుకు వచ్చినట్లు అనేది వారే సమాధానం చెప్పాలి.