Bigg Boss 7 : యునామినస్ గా కెప్టెన్ అయిన శివాజీ.. అందరితో సరదాగా గడిపేసిన నాగ్..!
NQ Staff - November 12, 2023 / 09:58 AM IST

Bigg Boss 7 :
బిగ్ బాస్ లో ఐదు రోజులు ఒక ఎత్తు అయితే.. శని, ఆదివారాలు మరో ఎత్తుగా ఉంటాయి. ఎందుకంటే హోస్ట్ నాగార్జున వచ్చి అందరి జాతకాలను బయట పెట్టేస్తాడు. ఆ ఐదు రోజుల్లో ఎవరేం చేశారో చెప్పి క్లాసులు తీసుకోవడం, ప్రశంసించడం లాంటివి ఉంటాయి. అయితే నిన్న శనివారం కూడా చాలా సరదాగానే గడిచిపోయింది. నాగార్జున స్టేజ్ మీదకు చాలా స్టైలిష్ గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ వారం కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన విషయాలను అడిగి తెలుసుకున్నాడు నాగార్జున. ఇక శివాజీ కొడుకు గురించి మాట్లాడాడు.
నీ కొడుకు అచ్చం నీలాగే ఉన్నాడంటూ ప్రశంసించాడు. ఇక నీకు హౌస్ లోకి వచ్చిన తర్వాత వెయిట్ తగ్గింది కానీ హెడ్ వెయిట్ పెరిగింది అంటూ అన్నాడు. దాంతో శివాజీ షాక్ అయ్యాడు. నేను నాలాగే ఉన్నాను. ప్రేక్షకులకు నచ్చితే ఉంటాను నాగార్జున గారు లేకుంటే లేదు అని సమాధానం ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్ ను ఎంపిక చేసే ప్రక్రియను స్టార్ట్ చేశారు. అర్జున్, శివాజీ ఇద్దరూ కెప్టెన్సీ కోసం కంటెండర్ టాస్క్ లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరిలో కెప్టెన్ ఎవరనేది తేల్చేందుకు చిన్న టాస్క్ పెట్టాడు నాగార్జున. కన్పెషన్ రూమ్ లో శివాజీ, అర్జున్ లను కెప్టెన్సీ కిరీటాలను పెట్టారు.
అయితే నాగార్జున కంటెస్టెంట్లను ఒక్కొక్కరినీ కన్పెక్షన్ రూమ్ లోకి పిలిచాడు. ఎవరు కెప్టెన్ కావాలని అనుకుంటారో చెప్పాలంటూ అందరినీ అడిగాడు. అందరూ యునామినస్ గా శివాజీ కెప్టెన్ కావాలని కోరుకుంటున్నట్టు తెలిపారు. ఆల్రెడీ అర్జున్ కెప్టెన్ అయ్యాడు. శివాజీ కెప్టెన్సీ ఎలా ఉంటుందో చూడాలి అని కారణాలు చెప్పారు. ఇక అంతిమంగా శివాజీ కెప్టెన్ కావడంతో ఆ కిరీటాన్ని శోభాశెట్టి తీసుకొచ్చి అతనికి పెట్టింది. మధ్యలో కొన్ని సరదా సంభాషనలు కూడా జరిపించారు నాగార్జున. అయితే శోభాతో కాఫీ పెట్టించుకుని స్టేజి పైకి తెప్పించుకుని తాగారు.

Shivaji took over captaincy
జాగ్రత్త సర్ కాఫీ వేడిగా ఉంది అని శోభాశెట్టి అన్నది. నీ అంత హాట్ గా అయితే ఉండదులే అని కొంటె సమాధానం చెప్పాడు నాగార్జున. ఇక తర్వాత ప్రియాంక బాయ్ ఫ్రెండ్ శివ గురించి మాట్లాడారు నాగార్జున. రతిక గురించి మాట్లాడుతూ ఏంటి రతిక.. శివ నీకు రోజ్ ఇచ్చాడు అని ప్రశ్నించాడు.
ఇక పక్కనే ఉన్న ప్రియాంక స్పందిస్తూ.. ఏమో సార్.. వాడు ఇస్తే ఈమె తీసేసుకుంది అంటూ సరదాగా మాట్లాడింది. దాంతో రతిక మాట్లాడుతూ.. అన్నయ్య ఇస్తున్నట్టు అనుకుని తీసుకున్నాను సార్ అని చెప్పింది. ఏమో అమ్మా.. నువ్వు ఎప్పుడు ఎవరిని అన్నయ్యా అంటావో.. ఎవరిని ఫ్రెండ్ అంటావో తెలియదు అని నాగార్జున సెటైర్ వేశాడు. దానికి పక్కనే ఉన్న ప్రశాంత్ నవ్వేసాడు.