Shivaji : ప్రశాంత్ కంటే నాకే ఎక్కువ డబ్బులు వచ్చాయి.. ఓపెన్ అయిన శివాజీ..!

NQ Staff - January 2, 2024 / 11:37 AM IST

Shivaji : ప్రశాంత్ కంటే నాకే ఎక్కువ డబ్బులు వచ్చాయి.. ఓపెన్ అయిన శివాజీ..!

Shivaji :

బిగ్ బాస్ సీజన్-7 గతంలో కంటే చాలా గ్రాండ్ విక్టరీ కొట్టింది. గత రెండు సీజన్లతో పోలిస్తే ఈ సీజన్ అత్యధిక టీఆర్పీ రేటింగ్ నమోదు చేసింది. పైగా ఈ సీజన్ మొత్తం రచ్చ రచ్చగానే సాగిపోయింది. ఎవరూ ఊహించిన విధంగా కామన్ మ్యాన్ గా ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిపోయాడు. అతనికంటే పెద్ద సెలబ్రిటీలు ఉన్నా సరే అతనికే కప్ సొంతం అయిపోయింది. అయితే కప్ గెలిచిన ఆనందం ప్రశాంత్ కు ఒక్క రోజు కూడా లేకుండా పోయింది. ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేయడంతో పాటు కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన ఫ్యాన్స్ తీవ్ర అంసతృప్తికి లోనయ్యారు.

చివరకు బెయిల్ మీద ప్రశాంత్ బయటకు వచ్చాడు. కానీ అప్పటి నుంచి ఆయన బయట కనిపించట్లేదు. ఇంటర్వ్యూలు కూడా ఇవ్వట్లేదు. వాస్తవానికి బిగ్ బాస్ టైటిల్ గెలిచిన వారు వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తుంటారు. కానీ ప్రశాంత్ మాత్రం ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. అయితే ఈ క్రమంలోనే శివాజీ చేస్తున్న కామెంట్లు వైరల్ అవుతున్నాయి. శివాజీ ఈ సీజన్ లో రెండో రన్నర్ గా నిలిచాడు. యావర్ నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఐదో స్థానంలో ప్రియాంక, ఆరో స్థానంలో అర్జున్ నిలిచారు.

అయితే శివాజీ సపోర్ట్ వల్లనే ప్రశాంత్ గెలిచాడనే వాదన ఉంది. ఇక శివాజీ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో ఆయన మాట్లాడుతూ.. కామన్ మ్యాన్ గా వచ్చిన ప్రశాంత్ విన్నర్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వాడు చాలా అమాయకుడు. రైతుబిడ్డగా బిగ్ బాస్ లోకి వచ్చాడు. అందుకే నేను అతనికి సపోర్ట్ చేశాను. ప్రశాంత్ కు యూట్యూబ్ ఛానెల్, సోషల్ మీడియా అకౌంట్స్ చాలానే ఉన్నాయి. వాటిని మేనేజ్ చేసుకున్నా సరే అతనికి డబ్బులు వస్తాయి. కానీ అలా చేయకుండా బిగ్ బాస్ కు వచ్చాడు.

బిగ్ బాస్ కు రావడం వల్ల ప్రశాంత్ నెలకు రూ.10లక్షల వరకు కోల్పోయాడు. ఇక బిగ్ బాస్ వల్ల ప్రశాంత్ కంటే నాకే ఎక్కువ డబ్బులు వచ్చాయి అని తెలిపాడు శివాజీ. శివాజీకి ఒక వారానికి గాను రూ.4లక్షల వరకు రెమ్యునరేషన్ ఇచ్చినట్టు సమాచారం. అతను హౌస్ లో దాదాపు 15 వారాలు ఉన్నాడు. ఇలా ఆయన మొత్తం 60లక్షల వరకు సంపాదించినట్టు తెలుస్తోంది.

పల్లవి ప్రశాంత్ రెమ్యూనరేషన్ వారానికి లక్ష కంటే తక్కువే అని తెలుస్తోంది. అతనికి ప్రైజ్ మనీ రూపంలో అన్ని కటింగ్ లు పోను రూ.35లక్షల వరకు అందాయి. కాబట్టి నెంబర్ల ప్రకారం చూసుకున్నా సరే శివాజీకే అత్యధిక డబ్బులు వచ్చినట్టు తెలుస్తోంది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us