Shiva Jyothi: డబ్బులెక్కువైతే సోకులు ఇలానే ఉంటాయ్.. శివజ్యోతి డ్రెస్సింగ్‌పై ట్రోలింగ్

Shiva Jyothi modern pic Gets trolling
Shiva Jyothi modern pic Gets trolling

Shiva Jyothi బిగ్ బాస్ షోలోకి వెళ్లకముందే శివజ్యోతి అంటే ఎవ్వరో జనాలకు తెలీదు. అదే తీన్మార్ సావిత్రి అంటే తెలంగాణలో ప్రతీ గడపకు తెలుసు. సావిత్రి అనేది శివజ్యోతి సొంత పేరు కాదు. అది మీడియా చానెల్‌కు సొంతమైన పేరు. అందుకే తనకంటూ సొంత ఐడెంటిటీ రావాలనే ఉద్దేశ్యంతోనే శివజ్యోతి బిగ్ బాస్ ఇంట్లోకి అడుగుపెట్టింది.

బిగ్ బాస్ ఇంట్లో తనను సావిత్రి అని పిలుస్తుంటే కూడా వద్దని వారించేది. శివజ్యోతి, జ్యోతి అని పిలిపించుకునేది. చివరకు జ్యోతక్క అనే ట్యాగ్‌తోనే బయటకు వచ్చింది. పాతాళగంగలా శివజ్యోతి మారిపోయింది. ప్రతీ చిన్న విషయానికి భోరున ఏడుస్తూ జనాలను విసిగించింది. కానీ ఎంత ఎమోషనల్ వీక్‌గా ఉండేదో.. ఫిజికల్‌గా అంతే స్ట్రాంగ్‌గా ఉండేది.

బిగ్ బాస్ వల్ల శివజ్యోతికి మంచే జరిగింది. ఫాలోయింగ్‌కు ఫాలోయింగ్.. ఉద్యోగానికి ఉద్యోగం ఇలా అన్నీ బాగానే కుదిరాయి. ఇప్పుడు శివజ్యోతికి సొంతిళ్లు ఉంది.. మొన్నీ మధ్యే కారు కూడా కొనుక్కుంది. అయితే ఇప్పుడు శివజ్యోతి లెవెల్ మారిపోయింది. దాంతో ఆమె కట్టూ బొట్టూ మారిపోయింది.

శివజ్యోతి డ్రెస్సింగ్‌ పై ట్రోలింగ్: Shiva Jyothi

తాజాగా ఆమె ఓ ఫోటోను షేర్ చేసింది. అందులో శివజ్యోతి మోడ్రన్ దుస్తుల్లో దర్శనమిచ్చింది. డబ్బులు ఎక్కువయ్యాయ్.. సోకులు పడుతోంది.. లెవెల్ మారిపోతే ఇలానే చేస్తారంటూ నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. మరి వీటిపై శివజ్యోతి ఏమైనా రియాక్ట్ అవుతుందో లేదో చూడాలి.

Advertisement