Raj Kundra: శిల్పా శెట్టి భ‌ర్త‌పై బిగిస్తున్న ఉచ్చు.. న‌గ్నంగా ఫొటోషూట్ అడిగాడు అని న‌టి కామెంట్స్

Raj Kundra: ప్ర‌ముఖ హీరోయిన్ శిల్పా శెట్టి భ‌ర్త‌, వ్యాపారవేత్తగా ముంబయిలో గుర్తింపు.. సెలబ్రిటీ స్టేటస్ పొందిన రాజ్ కుంద్రా ప్ర‌స్తుతం బీటౌన్లో సంచ‌ల‌నంగా మారాడు. నీలిచిత్రాలు తీస్తున్నాడన్న ఆరోపణతో పోలీసులు అరెస్టు చేయటంతో అతడి పేరు మరోసారి వార్తల్లోకి ఎక్కింది. గతంలో ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీతో పాటు బెట్టింగ్, వివాదాల వ్యవహారాల ఎపిసోడ్ లో రాజ్ కుంద్రా పేరు బాగా నలిగింది.

తాజాగా ఆయ‌న పేరు మ‌రోసారి వార్త‌ల‌లోకి ఎక్కింది.వెస్ట్ ముంబయిలోని ఒక బిల్డింగ్ లో నీలి చిత్రాలు తీసే ఒక ముఠాను ముంబయి ప్రాపర్టీ సెల్ పోలీసులు అరెస్టు చేశారు. అలా వారు అదుపులోకి తీసుకున్న తొమ్మిది మందిలో నటి కం మోడల్ గెహానా వశిష్ఠ్.. రోవా ఖాన్ ఉన్నారు. ఈ ప్రొడక్షన్ యూకే ప్రొడక్షన్ కంపెనీదిగా గుర్తించారు. దానికి హెడ్ గా ఉమేశ్ కామత్ కావటం.. అతడు గతంలో రాజ్ కుంద్రా వద్ద పని చేసినట్లు గుర్తించారు.

రాకెట్ లో రాజ్ కుంద్రా ప్రమేయం ఉందన్న ఆధారాల్ని సంపాదించిన పోలీసులు.. తాజాగా అతడ్ని అరెస్టు చేసినట్లు చెబుతున్నారు. అతనిపై ఐపీసీ సెక్షన్ 292, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సెక్షన్ 67, 67 ఎ, మహిళల అసభ్య ప్రాతినిధ్యం (నిషేధం) రూల్స్ 3, 4 కింద కేసు నమోదు చేశారు.

రీసెంట్‌గా నటి, మోడల్ సాగరిక సోనా సుమన్, రాజ్ కుంద్రా తనను నగ్నంగా ఆడిషన్ ఇమ్మని అడిగారంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. అందుకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. కొంతకాలంగా తాను ఇండస్ట్రీలో ఉంటున్నా పెద్దగా అవకాశాలు రాలేదని, గతేడాది ఉమేశ్ కామత్ అనే వ్యక్తి కాల్ చేసి, రాజ్ కుంద్రా నిర్మిస్తున్న వెబ్ సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తానని చెప్పాడు. రాజ్ కుంద్రా ఎవరు అని అడిగితే శిల్పా శెట్టి భర్త అని కూడా చెప్పాడు. అంటూ ఆ వీడియోలో చెప్పింది.

లాక్ డౌన్ వ‌ల‌న వీడియా కాల్ ఆడిషన్ ఇవ్వాల‌ని చెప్ప‌డంతో కాల్ చేశాను. వారు న్యూడ్‌గా ఇవ్వ‌మ‌ని అడిగాను. అలా కుద‌ర‌ద‌ని చెప్పాను.అయితే వీడియో కాల్‌లో ముగ్గురు జాయిన్ అయ్యారు. వాళ్లల్లో ఒక వ్యక్తి తన ఫేస్ కనిపించకుండా జాగ్రత్తపడ్డాడు. కానీ అతనే రాజ్ కుంద్రా అనుకుంటున్నాను. అతడే కనుక ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసినట్లయితే అరెస్ట్ చేసి, నాలా ఇంకెంతమందితో ఇలాంటి నీచమైన చర్యలకు పాల్పడ్డాడో విచారించి ఈ రాకెట్ బయటపెట్టాలని పోలీసులను కోరుతున్నాను’ అంటూ రాజ్ కుంద్రా గురించి కామెంట్స్ చేసింది సాగరిక సుమన్.ప్ర‌స్తుతం ఈ అమ్మ‌డు కామెంట్స్‌తో వ్య‌వ‌హారం మ‌రింత హీటెక్కింది.