Crime News : వావ్.! వాట్ ఏ స్కెచ్.! ప్రియుడితో కలిసి భర్త అడ్డు తొలగించేసిన భార్య.?
NQ Staff - December 25, 2022 / 10:30 AM IST

Crime News : అక్రమ సంబంధాల కారణంగా ఎంతో మంది అమాయకుల ప్రాణాలు అన్యాయంగా బలైపోతున్న సందర్భాలు అనేకం చూశాం. కానీ, ఈ ముచ్చట కాస్త డిఫరెంట్. అందుకే సోషల్ మీడియాలో ఈ న్యూస్ తెగ వైరల్ అవుతోందిప్పుడు.
పబ్బేరు మండలం బూడిదపాడు గ్రామానికి చెందిన ఎండీ అబ్ధుల్ గద్వాల పట్టణానికి చెందిన మెహబూబానీ 12 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అదే పట్టణంలో ఓ అద్దె ఇంట్లో వుంటూ కూరగాయల వ్యాపారం చేసుకునేవారీ భార్య భర్తలు. వీరికి తొమ్మిదేళ్ల కొడుకు కూడా వున్నాడు. హ్యాపీ ఫ్యామిలేనే వున్నంతలో.
ప్లాన్ బెడిసికొట్టి, పోలీసులకు చిక్కి.!
అయితే, అదే ప్రాంతానికి చెందిన రహీమ్ అనే వ్యక్తితో గత కొంతకాలంగా మెహబూబానీకి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధంగా మారింది. వన్ ఫైన్ డే భర్తకు దొరికిపోయింది మెహబూబానీ.
భార్యపై వున్న ప్రేమతో, ప్రేమగానే మందలించాడు. కానీ, అప్పటికే అక్రమ సంబంధం మోజులో పడిన మెహబూబానీ భర్త ప్రేమను పక్కన పెట్టేసింది. ఎలాగైనా సరే, అతన్ని హతమార్చేసి ప్రియుడితో వెళ్లిపోవాలనుకుంది. ఒక రాత్రి చున్నీతో భర్త మెడకు వురి వేసింది. చనిపోయాడని గ్రహించాకా, బంధువులకు ఫోన్ చేసి ఫిట్స్‌తో చనిపోయాడని నమ్మ బలికింది.
కానీ, పోలీసుల విచారణలో దొరికిపోయింది. చేసిన పాపం ఊరికే పోతుందా.? ప్రియుడ్ని నమ్ముకుని నిజమైన ప్రేమ పంచే భర్తను హతమార్చేసింది. ఈ ఘటన జరిగాకా ప్రియుడు పరార్ అయిపోగా, పోలీసులకు దొరికిపోయి నిండు జీవితాన్ని నాశనం చేసుకుంది మెహబూబానీ.!