శర్వానంద్ పెళ్లి.. ఉపాసనే కీలకం కానుందా ?

Advertisement

కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించినప్పటికీ టాలీవుడ్ లో కొంతమంది నటులు వివాహం చేసుకున్నారు. అయితే నిఖిల్, నితిన్, దగ్గుబాటి రానా, బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పి ఓ ఇంటి వాళ్లు అయ్యారు. ఇక వీరి జాబితాలోనే మరో యువ హీరో చేరనున్నారు. టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ కూడా త్వరలో పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. అయితే ఇండస్ట్రీలో 16 ఏళ్ళుగా సినిమాలు చేస్తున్నాడు శర్వానంద్. ఇక ప్రస్తుతం శర్వానంద్ కు 36 ఏళ్లు వయస్సు ఉంటుంది. అయితే వయస్సు పెరుగుతున్న నేపథ్యంలో శర్వానంద్ ను పెళ్లి చేసుకోమని తన తల్లిదండ్రులు తెగ ఇబ్బంది పెడుతున్నారు అంట.

దీనితో తన స్నేహితురాలిని పెళ్లి చేసుకోబోతున్నట్లు పలు వార్తలు బయటికి వచ్చాయి. ఇది ఇలా ఉంటె ఈ మధ్య శర్వానంద్ పెళ్లి విషయంలో మరో కొన్ని వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే రామ్ చరణ్ భార్య ఉపాసన కోణిదెల కజిన్ ‌ను శర్వానంద్ వివాహం చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక ఇప్పటికే రాంచరణ్, శర్వానంద్ మంచి స్నేహితులు. ఇక ఈ పెళ్లి తో వీరి స్నేహం కాస్త బందుత్వంగా మారబోతుంది అని పలువురు సన్నిహితులు అంటున్నారు. ఇక ఈ పెళ్ళికి ఇరు కుటుంబంల పెద్ద ఎవరో కాదు రామ్ చరణ్ భార్య ఉపాసనే.. అని వార్తలు వస్తున్నాయి.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here