శర్వానంద్ తో మూవీ చేయనున్న RX- 100 దర్శకుడు

Advertisement

RX- 100 మూవీతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును తెచ్చుకోవడంతో పాటు ఒక ట్రెండ్ ను సెట్ చేసిన దర్శకుడు అజయ భూపతి తన నెక్స్ట్ చిత్రాన్ని ప్రకటించారు. ఈ మూవీకి “మహా సముద్రం” అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీలో హీరో శర్వానంద్ నటిస్తున్నట్టు అజయ్ తెలిపారు. అలాగే ఈ చిత్రాన్ని తమిళ్- తెలుగు నిర్మిస్తున్నట్టు అజయ్ ట్విట్టర్ లో తెలిపారు.

ఈ మూవీని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ మూవీ ఒక ఇంటెన్స్ లవ్-యాక్షన్ డ్రామా నేపధ్యంలో మూవీ ఉండనుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ మూవీకి సంబంధించిన తదుపరి అప్డేట్ ను వచ్చే సోమవారం ఇవ్వనున్నామని అజయ్ వెల్లడించారు. RX- 100తో మాంచి హిట్ అందుకున్న అజయ్ ఈ మూవీతో శర్వానంద్ కు హిట్ ఇస్తారో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here