Sharwanand And Rakshita Reddy : శర్వానంద్ పెండ్లి చేసుకోబోయే అమ్మాయికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..?
NQ Staff - January 28, 2023 / 12:47 PM IST

Sharwanand And Rakshita Reddy : టాలీవుడ్ లో మోస్ట్ ట్యాలెంటెడ్ హీరో అయిన శర్వానంద్ ఎట్టకేలకు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. శర్వానంద్ రీసెంట్ గానే ఓ హిట్ అందుకున్నాడు. అన్ స్టాపబుల్ ప్రోగ్రామ్ లో పాల్గొన్నప్పుడు నీ పెండ్లి ఎప్పుడు అని బాలయ్య అడిగితే ప్రభాస్ తర్వాత అని చెప్పాడు. వాస్తవానికి ఆయన పెండ్లిపై గత రెండు, మూడు నెలల నుంచి ఏదో ఒక న్యూస్ వినిపిస్తూనే ఉంది.
ఆయన పలానా అమ్మాయిని ప్రేమిస్తున్నాడని, ఆమెను పెండ్లి చేసుకోబోతున్నాడని అంటున్నారు. అంతలోనే ఆయన పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకుంటున్నాడంటూ వార్తలు వచ్చాయి. అయితే ఎట్టకేలకు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అమ్మాయిని పెండ్లి చేసుకున్నాడు.
ఆయన మనవరాలు..
ఆ అమ్మాయి పేరు రక్షిత రెడ్డి. ఆమె ఎవరో కాదు తెలంగాణ హైకోర్టు లాయర్ మధుసూదన్ రెడ్డి కుమార్తె. రక్షిత రెడ్డి ఏపీ మాజీ మంత్రి దివంగత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మనవరాలట. అంటే ఆమెకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉందన్నమాట. ఆమె తాతలు, తండ్రుల పేరు చెప్పుకుని బతకకుండా తన కాళ్ల మీద తాను నిలబడే అమ్మాయి.
ఆమె మొన్నటి వరకు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా చేసింది. ఇప్పుడు ఇంటి వద్ద నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ లో జాబ్ చేస్తోంది. ఆమెకు తాతలు, తండ్రుల నుంచి వచ్చిన ఆస్తులు బాగానే ఉన్నాయి. లగ్జరీ కార్లు, ఖరీదైన ఇల్లు, స్థిర, చరాస్తులు కలిపి బాగానే ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.