YS Sharmila : చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా… కాంగ్రెస్ లోకి వెళ్ళను అని చెప్పలేదు
NQ Staff - June 23, 2023 / 07:15 PM IST

YS Sharmila : వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల గురించి గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే. కాంగ్రెస్ పార్టీ లో ఆమె తన పార్టీని విలీనం చేయబోతున్నట్లుగా తెగ ప్రచారం జరుగుతున్న విషయం తెల్సిందే.
ఈ నేపథ్యం లో షర్మిల చేసిన ట్వీట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. షర్మిల ట్విట్టర్ లో… వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా, తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది. ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు, తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి. పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే. నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి. అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి. కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి. నా భవిష్యత్తు తెలంగాణతోనే, తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే.
షర్మిల ట్వీట్ లో తాను తెలంగాణ బిడ్డగా చివరి శ్వాస వరకు ఉంటాను అంటూ స్పష్టంగా చెప్పడం జరిగింది. కానీ తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయబోవడం లేదు అంటూ చెప్పలేదు. ఉన్నట్లుండి ఆమె ఈ ట్వీట్ చేయడం కు కారణం ఏంటో అంటూ మాట్లాడుకుంటున్నారు. మొత్తానికి వైఎస్సార్‌టీపీ త్వరలోనే కాంగ్రెస్ లో విలీనం అవ్వడం ఖాయంగా తెలుస్తోంది.