Sharmila Politics In Congress : రేవంత్ ఒక్కడే వ్యతిరేకం.. సీనియర్లంతా షర్మిలవైపే.. అందుకే కీలక పదవి..?
NQ Staff - September 3, 2023 / 11:25 AM IST

Sharmila Politics In Congress : షర్మిల పేరు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో బాగా వినిపిస్తోంది. మొన్నటి వరకు ఒంటరి పోరాటం చేసిన ఆమె.. ఇప్పుడు కాంగ్రెస్ కు ప్రధాన బలం కాబోతోంది. అసలే తెలంగాణ కాంగ్రెస్ లో వైఎస్సార్ మద్దతు దారులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో కీలక స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ నేతలందరూ ఒకప్పుడు వైఎస్సార్ మద్దతుతో ఎదిగిన వారే. అదే ఇప్పుడు షర్మిలకు అతిపెద్ద బలం కాబోతోంది. షర్మిల కాంగ్రెస్ లో చేరడం దాదాపు ఖాయమైపోయింది. కాకపోతే ఇంకా అధికారికంగా చేరలేదు. అయితే షర్మిల కాంగ్రెస్ లో చేరడాన్ని సీనియర్లంతా స్వాగతిస్తున్నారు.
కానీ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఒక్కడే వ్యతిరేకిస్తున్నాడు. మొదటి నుంచి ఆయన ఇలా వ్యతిరేకించడానికి ఓ పెద్ద కారణమే ఉంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే రేవంత్ కాంగ్రెస్ లో ఎదుగుతున్నాడు. పైగా కాంగ్రెస్ లో తన ఇష్టా రాజకీయాలు సాగుతున్నాయి. ఇన్ని రోజులు వ్యతిరేకిస్తున్న సీనియర్లు ఇప్పుడు సైలెంట్ అవుతున్నారు. ఇలాంటి సమయంలో షర్మిల గనక పార్టీలోకి వస్తే.. సీనియర్లు అందరూ షర్మిల వైపు వెళ్లిపోవడం ఖాయం. అప్పుడు రేవంత్ కు ఎవరి మద్దతు లేకుండా పోతోంది. ఇన్ని రోజులు తాను అనుకున్నవన్నీ పటాపంచలు అయిపోతాయి.
తనను వ్యతిరేకిస్తున్న సీనియర్లు అందరూ షర్మిల వైపు చేరితే.. పార్టీలో షర్మిల మైలేజ్ అమాంతం పెరిగిపోతుంది. దాంతో రేవంత్ ను ఎవరూ పట్టించుకోరు. అప్పుడు ఢిల్లీ అధిష్టానం కూడా షర్మిలకే పార్టీ పగ్గాలు ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని రేవంత్ భయపడుతున్నాడు. ఆయన అనుకున్నట్టే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లందరూ షర్మిల రాకను సాదరంగా స్వాగతిస్తున్నారు. షర్మిల పార్టీలోకి వస్తే తామంతా సపోర్ట్ చేస్తామని వారంతా ఇప్పటికే ఢిల్లీ అధిష్టానానికి చెప్పేశారు. అందుకే ఢిల్లీ అధిష్టానం షర్మిల సేవలను వాడుకోవాలని భావిస్తోంది.
అందుకే ఆమె కోరిన విధంగానే పాలేరు నియోజకవర్గం టికెట్ ఇవ్వడానికి కూడా ఒప్పుకుంది. అంతే కాకుండా షర్మిలకు కీలక పదవి ఇస్తున్నట్టు తెలుస్తోంది. ఆమెను వచ్చే ఎన్నికల్లో స్టార్ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతా ప్రచారం చేసేలా చూస్తున్నారంట రాహుల్ గాంధీ. మొన్న జరిగిన భేటీలో ఈ విషయాలు కూడా చర్చకు రాగా.. అందుకు షర్మిల కూడా ఒప్పుకున్నట్టు తెలుస్తోంది.
వైఎస్సార్ కుటుంబంపై తెలంగాణ రైతుల్లో ఇంకా అభిమానం ఉంది. ఒకప్పుడు వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలు ఇంకా గుర్తుంచుకున్నారు. కాబట్టి రాజన్న బిడ్డపై ప్రజల్లో కూడా మంచి మమకారం ఉంటుందని.. కాబట్టి ఆమెతో రాష్ట్ర మంతా ప్రచారం చేయించాలని చూస్తోంది కాంగ్రెస్ పార్టీ. చూస్తుంటే రాను రాను షర్మిల ఇంకా పెద్ద పొజీషన్ లో ఉండే అవకాశాలు ఉంటాయని తెలుస్తోంది.