Shakila smokes cigarette : బిగ్ బాస్ లో సిగరెట్ తాగిన లేడీ కంటెస్టెంట్.. ఇలాంటివి కూడా చేయొచ్చా..?

NQ Staff - September 12, 2023 / 11:07 AM IST

Shakila smokes cigarette : బిగ్ బాస్ లో సిగరెట్ తాగిన లేడీ కంటెస్టెంట్.. ఇలాంటివి కూడా చేయొచ్చా..?

Shakila smokes cigarette : బిగ్ బాస్-7 ఇప్పుడిప్పుడే రచ్చ రచ్చగా సాగుతోంది. మొన్నటి వరకు కాస్త ఫ్రెండ్లీగా కలిసి ఉన్న వారిని బిగ్ బాస్ చూస్తూ ఉండలేకపోయాడు కాబోలు. అందుకే ఈ సారి రచ్చ రచ్చ చేయాలని చూశాడు. ఇంకేముంది సోమవారం నామినేషన్స్ టాస్క్ ను తనకు కావాల్సినంత కాంట్రవర్సీగా మార్చేసుకున్నాడు. అయితే ఆదివారం ఎలిమినేషన్స్ సందర్భంగా ఒకరిని ఎలిమినేట్ చేయాలి కాబట్టి నామినేషన్స్ లో ఉన్న ఎనిమిది మందికి గేమ్ పెట్టాడు. మొదటి గేమ్ లో రతిక, శోభాశెట్టిన సేఫ్ చేసేశాడు.

తర్వాత మరో గేమ్ పెట్టాడు. అందులో నలుగురిని సేఫ్‌ చేశాడు. చివరకు ప్రిన్స్ యావర్, కిరణ్‌ రాథోడ్ చివర దశకు చేరుకున్నారు. అందులో కిరణ్‌ ను ఎలిమినేట్ చేశాడు. దాంతో ఆమె చాలా ఎమోషనల్ అయింది. హౌస్ మేట్స్ కూడా ఆమెతో ఉన్న జ్ఞాపకాలను పంచుకున్నారు. ఇక షకీలా అయితే చాలా ఎమోషనల్ అయిపోయింది. ఎందుకంటే కిరణ్‌ రాథోడ్ తో షకీలాకు మంచి అనుబంధం ఏర్పడింది. వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

అందుకే కిరణ్‌ రాథోడ్ ఎలిమినేట్ అయితే షకీలా చాలా ఎమోషనల్ అయింది. తట్టేకోలేక ఏడ్చేసింది. ఇక కిరణ్‌ రాథోడ్ కూడా షకీలా గురించి చాలా బాగా చెప్పింది. ఆమె చాలా మంచి స్నేహితురాలి అని వివరించింది. ఎవరికి ఏం కావాలన్నా షకీలా అందరికంటే ముందు రెస్పాండ్ అవుతుందని వివరించింది. ఇలా చెప్పిన తర్వాత కిరణ్‌ రాథోడ్ వెళ్లిపోతుంటే.. చాలా ఒత్తిడికి గురైన షకీలా సిగరెట్ తాగుతూ కినిపించింది.

ఇక కిరణ్‌ రాథోడ్ ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చుతున్నట్టు కనిపించింది. అయితే షకీలా సిగరెట్ తాగే దృశ్యం మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే సాధారణంగా బిగ్ బాస్ లో ఇలాంటివి అనుమతించరు. కానీ ఈ సీజన్ లో ఇలాంటివి కూడా ఉన్నాయా అని అందరికీ అర్థం అయిపోయింది. కాగా బిగ్ బాస్ లో ఇలా సిగరెట్ తాగడం ఇదేం కొత్త కాదు. గతంలో బిగ్ బాస్ ఓటీటీ సీజన్ లో అషురెడ్డి, సరయు, లోబో లాంటి వారు తాగారు.

అప్పుడు వారి కోసం సెపరేటుగా స్మోకింగ్ జోన్ ను ఏర్పాటు చేశాడు బిగ్ బాస్. ఇప్పుడు షకీలా ఏడో సీజన్ లో మొదలు పెట్టింది. కానీ ఇప్పుడు స్మోకింగ్ జోన్ లేకున్నా ఎక్కడ బడితే అక్కడ సిగరెట్ తాగడం ఉందేమో అని అనుకుంటున్నారు. మరి ముందు ముందు ఇంకెవరైనా ఇలా సిగరెట్ తాగుతారేమో అని అంతా అనుకుంటున్నారు. చూడాలి మరి ముందు ముందు ఇంకేంఉ జరుగుతుందో అనేది.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us