Shakeela షకీలా..ఈ పేరుకి పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు అభిమానులకు ఆరాధ్యదైవంగా ఉన్న షకీలా ఇప్పుడు ఫేడ్ ఔట్ అయింది. అప్పట్లో షకీలా పేరెత్తితే అభిమానులు పూనకం వచ్చినట్టు ఊగిపోయేవారు. కొందరు గుడులు కట్టి మరి పూజలు చేసేవారు. షకీలా సినిమా ముందు స్టార్ హీరోల సినిమాలు కూడా బలాదూర్ అనే చెప్పాలి. తన సినిమాలతో బాక్సాఫీస్ బద్దలు కొట్టిన షకీలా దాదాపు రెండు దశాబ్ధాల పాటు వెండితెర సెక్సీ క్వీన్‌గా ఓ వెలుగు వెలుగొందారు. అనంతరం మెల్లమెల్లగా సినిమాలకు దూరమైన షకీలా చాన్నాళ్లు ప్రేక్షకులకి కనిపించలేదు. అయితే ఇటీవల తన బయోపిక్‌తో మళ్లీ వార్తలలోకి రావడమే కాక తన జీవితానికి సంబంధించి పలు విషయాలను షేర్ చేసుకుంది.
ప్రస్తుతం తమిళ్ స్మాల్ స్క్రీన్ పై ప్రసారం అవుతున్న ‘కుక్ విత్ కోమలి’ అనే షోలో కంటిస్టెంట్ గా ఉన్నారు షకీలా. ఈ షో ద్వారా తన కూతురిని పరిచయం చేసింది. గతంలో పలు సందర్భాలలో తన పరిస్థితుల గురించి వివరించిన షకీలా ఓ కూతురిని దత్తత తీసుకున్నట్టు పేర్కొంది. తాజాగా ఆమె ఎవరు ఎలా ఉంటారనే అనుమానాలకి పులిస్టాప్ పెట్టింది. పెళ్లి కాని షకీలా ఓ ట్రాన్స్‌జెండర్‌ను దత్తత తీసుకోగా, చిన్నప్పటి నుండి ఆమె ఆలనా పాలనా చూసుకుంటూ వస్తుంది. కూతురి పేరు మిల్లా అని చెప్పిన షకీలా ఆమెకు పాతికేళ్లకు పైగా ఉంటాయని తెలుస్తుంది. జీవితంలో తనకు నేను నాకు తను అండగా ఉన్నామని ,చెప్పిన షకీలా ఎమోషనల్ అయింది.

శృం గార తార జీవితంలో ఎన్నో మలుపులున్నాయి. కొందరు ఆమె సక్సెస్‌ను చూడలేక తొక్కేశారని కామెంట్స్ కూడా వినిపించాయి. స్వయంగా షకీలా కుటుంబ సభ్యులే ఆమెను మోసం చేశారు.ఆమె జీవితంలో ఎన్నో మలుపులు ఉన్నాయి. వాటన్నింటిని బేస్ చేసుకొని షకీలా అనే చిత్రం తెరకెక్కించగా, ఈ బయోపిక్‌ని ‘షకీలా’ అనే పేరుతోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. తెలుగు,తమిళం,హిందీ భాషల్లో ఈ మూవీ విడుదలైంది. బాలీవుడ్ నటి రిచా చద్దా ఈ షకీలా మూవీలో టైటిల్ రోల్లో కనిపించారు. పంకజ్ త్రిపాఠి, మలయాళ నటుడు రాజీవ్ పిళ్లై ముఖ్య పాత్రలు పోషించారు. ఇకపోతే ఈ సినిమాలో మహిళల కోసం ప్రత్యేకంగా ఓ సందేశం ఉందని, తనలా ఎవరూ మోసపోకూడదనే ఉద్దేశ్యంతో ఇలా తన బయోపిక్‌తో మంచి సందేశాన్ని ఇవ్వనుండటం సంతోషంగా ఉందని ఇటీవలే షకీలా పేర్కొన్నారు.