Shahin Afridi : త‌న బౌలింగ్‌లో సిక్స్ కొట్టాడ‌ని కాళ్ల‌పైకి బంతిని బ‌లంగా విసిరిన పాక్ బౌల‌ర్

Shahin Afridi : పాక్ బౌల‌ర్ షాహిన్ అఫ్రిదికి కాస్త టెంప‌ర్ ఎక్కువే. భార‌త్‌తో జ‌రిగిన వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌లో షాహిన్‌ అఫ్రిది కోపంతో బంతిని నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌వైపు విసిరాడు. త్రో మిస్‌ అయి ఓవర్‌త్రో అవ్వడంతో నాలుగు పరుగులు అదనంగా.. ఓవరాల్‌గా ఆరు పరుగులు వచ్చాయి. ఒకవేళ టీమిండియా 5 పరుగుల తేడాతో గెలిస్తే మాత్రం పరోక్షంగా పాక్‌ ఓటమికి కారణం అఫ్రిది అవుతాడంటూ ఫ్యాన్స్‌ కామెంట్స్‌ చేశారు.

TheNewsQube-
shahin afridi ball throw after being hit six to batsman
shahin afridi ball throw after being hit six to batsman

తాజాగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టి20లో పాకిస్తాన్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షాహిన్‌ అఫ్రిది కంట్రోల్‌ తప్పాడు. తన బౌలింగ్‌లో సిక్స్‌ కొట్టాడని సహించని షాహిన్‌.. బంతితో కసితీరా ప్రత్యర్థి బ్యాటర్‌పైకి విసిరి తన కోపాన్ని ప్రదర్శించాడు. ఈ హఠాత్పరిణామానికి అంపైర్లు కూడా షాక్‌ అయ్యారు.

ఇన్నిం‍గ్స్‌ 3వ ఓవర్‌ వేసిన అఫ్రిది బౌలింగ్‌లో రెండో బంతిని ఆఫిఫ్‌ హొస్సెన్‌ లెగ్‌స్టంప్‌ దిశగా భారీ సిక్స్‌ కొట్టాడు. దీంతో ఆగ్రహానికి లోనైన షాహిన్‌ అఫ్రిది తర్వాతి బంతిని కోపంతో విసిరాడు. అయితే అఫిఫ్‌ డిఫెన్స్‌ ఆడడంతో పరుగు రాలేదు. అప్పటికే ఆగ్రహంతో ఉన్న షాహిన్‌ బంతిని అందుకొని కసితీరా హొస్సెన్‌ కాళ్లవైపు విసిరాడు. బంతి బలంగా తాకడంతో హొస్సెన్‌ కిందపడి నొప్పితో విలవిల్లాలాడాడు.

షాహిన్‌ తీరుపై సోషల్‌ మీడియాలో మాత్రం క్రికెట్‌ అభిమానులు ఏకిపారేశారు. ”కసితీరా కొట్టావు.. సారీ ఎందుకు షాహిన్‌.. మీకింకా టి20 ప్రపంచకప్‌ 2021 కప్‌ గెలవలేదనే మత్తు దిగనట్టుంది.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తున్నారు.. చేసిందంతా చేసి ఇప్పుడెందుకు సారీ” అంటూ కామెంట్స్‌ చేశారు.

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన బంగ్లాదేశ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది. షాంటో 40 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. పాక్‌ బౌలర్ల దాటికి మిగతవారు పెద్దగా రాణించలేకపోయారు. 109 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ గెలుపు దిశ‌గా సాగుతుంది.