England Cricket Team: షాకింగ్ ఇంగ్లండ్ క్రికెట్ టీంలో కరోనా కలకలం.. ఏడుగురికి పాజిటివ్
Samsthi 2210 - August 2, 2021 / 03:41 PM IST

కరోనా మహమ్మారి బుసలు కొడుతుంది. అన్ని రంగాలను కరోనా కుదిపేస్తుండగా, సామాన్యులతో పాటు సెలబ్రిటీలు వణికిపోతున్నారు. కరోనా వలన ఇప్పటికే పలు గేమ్స్ కూడా బ్రేక్ పడ్డాయి. రీసెంట్ ఐపీఎల్ కూడా కరోనా వలన వాయిదా పడింది. కొందరు క్రికెటర్స్‌కి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో గేమ్‌కి మధ్యలోనే బ్రేక్ వేశారు. త్వరలో దుబాయ్‌లో ఈ సిరీస్ కంటిన్యూ చేయనున్నట్టు తెలుస్తుంది.

England cricket team
ఇక ప్రస్తుతం పలు జట్ల మధ్య కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ మ్యాచ్‌లు నడుస్తున్నాయి. కొన్నిసజావుగానే నడుస్తున్నప్పటికీ మరి కొన్ని మ్యాచ్‌లకు కరోనా అడ్డుకట్ట వేస్తుంది. తాజాగా ఇంగ్లండ్ క్రికెట్ టీమ్‌లో కరోనా కలకలం రేపింది. ఒకేసారి ఏడుగురు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. వీళ్లలో ముగ్గురు ప్లేయర్స్ కాగా, నలుగురు టీమ్ మేనేజ్‌మెంట్ సభ్యులు ఉన్నట్లు ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు వెల్లడించింది.
జులై 4నే వీరందరికీ కోవిడ్ సోకినట్లు నిర్దారణ కావడంతో అదే రోజు ఐసోలేషన్ వెళ్లారు. అంతే కాకుండా వీరితో సన్నిహితంగా ఉండి, నెటెటివ్ వచ్చిన ఇతర క్రికెటర్లను క్వారంటైన్ తరలించారు. జులై 8 నుంచి పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ప్రారంభం కావల్సి ఉండగా ఇంగ్లాండ్ జట్టు ఐసోలేషన్‌కు వెళ్లిపోవడంతో తాజా షెడ్యూల్‌పై అనుమానాలు నెలకొన్ని ఉన్నాయి.
అయితే వన్డే సిరీస్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఈసీబీ స్పష్టం చేసింది. ప్రస్తుతం సెలవులో ఉన్న బెన్ స్టోక్స్‌ను తిరిగి పిలిపిస్తున్నట్లు ఈసీబీ పేర్కొన్నది. బెన్‌స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్‌తో వన్డే సిరీస్ ఆడుతుందని ఈసీబీ ప్రకటించింది. ఇంగ్లాండ్ సెలెక్టర్లు కాసేపట్లో మిగిలిన టీమ్‌ను ప్రకటించనున్నారు.
ఈసీబీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టామ్ హారిసన్ మీడియాతో మాట్లాడుతూ బయో సెక్యూర్ పరిస్థితులకు దూరంగా ఉంటే వైరస్ వ్యాప్తి చెందుతుందని ముందే ఊహించాం . గడిచిన 14 నెలల్లో ఆటగాళ్లు, సిబ్బంది ఎక్కువశాతం కఠిన పరిస్థితుల్లో గడిపినందున అందరి మంచి కోసం కరోనా నిబంధనల్ని పాటించడానికి ఒక వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.