కరోనా వల్ల దొంగగా మారిన నటి
Admin - September 16, 2020 / 10:19 AM IST

కరోనా మహమ్మారి కారణంగా ప్రతిఒక్కరికి పరిస్థితి దారుణంగా మారింది. కొందరు అయితే వంటలు నేర్చుకుంటే, మరికొందరు వర్క్ ఔట్లు చేసి బాడీని పెంచారు. ఇది ఇలా ఉంటె చెన్నై కి చెందిన సీరియల్ నటి ఏకంగా దొంగ లాగా మారింది. ఇక తన ప్రియుడితో కలిసి దొంగతనాలకు పాల్పడింది. ఇంతకు ఎవరా దొంగ అంటే దేవత తో పాటు పలు సీరియల్స్ నటించిన సుచిత్ర .ఇక ఈ నటి సీరియల్లో తన నటనతో అందరిని ఆకట్టుకునేది. ఇక ప్రియుడు మణికందన్ తో కలసి సహాజీవనం చేస్తు దొంగతనాలు మొదలు పెట్టింది. ఆ దొంగతనం ఎక్కడో కాదు, తన ప్రియుడు మణికందన్ ఇంట్లోనే. అయితే మణికందన్ కు ఇంతకు ముందే వివాహం జరిగింది.
మణికందన్ చెన్నైలో ఉంటు టీవి, సినీ నటుల దగ్గర డ్రైవర్ గా పనిచేస్తూ ఉండేవాడు. ఇక ఈ సమయంలోనే నటి సుచిత్రతో అతనికి పరిచయం ఏర్పడింది. మణికందన్ కు వివాహం అయిందని తెలిసి కూడా అతడితో సహజీవనం చేసింది. ఇక లాక్ డౌన్ వల్ల డబ్బులకు ఇబ్బంది కావడంతో సుచిత్రా ఒక ప్లాన్ వేసింది. ఆమె, మణికందన్ తన తండ్రి ఇంటిలోనే యాబైవేల రూపాయలు,18 తులాల బంగారంతో ఇంట్లోనుండి పరారీ అయ్యారు. ఇక వెంటనే మణికందన్ తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసారు. నిందితులను పట్టుకునే పనిలో పోలీసులు ఉన్నారు.