ఆత్మహత్య చేసుకున్న టీవీ నటి శ్రావణి
Admin - September 9, 2020 / 04:20 AM IST

సినీ పరిశ్రమలో ఇప్పుడు చాలామంది ప్రముఖులు అత్యహత్యాలు చేసుకుంటున్నారు. మొన్నటి మొన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోగా, ఆ విషయం పై ఇంకా ఆ స్పష్టత రాలేదు. అయితే ఇప్పుడు తెలుగు సీరియల్స్ లో నటిస్తున్న నటి శ్రావణి ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లో ఉన్న మధుర నగర్ లో నివాసం ఉంటున్న శ్రావణి మంగళవారం రాత్రి తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.
టిక్ టాక్ లో ఒక వ్యక్తి శ్రావణికి పరిచయమయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. అయితే ఇప్పుడు ఆ ప్రేమికుడు తాము సన్నిహితంగా ఉన్నప్పటి ఫొటోస్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బ్లాక్ మెయిల్ చేస్తూ శ్రావణి దగ్గర నుండి డబ్బులు వసూలు చేసేవాడు. అయితే అతని వేధింపులు అధికం కావడం వల్ల శ్రావణి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చింది. అయినా కూడా అతను విధించడం ఆపలేదు. అతని వేధింపులు తట్టుకోలేకనే శ్రావణి ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. ఈ ఘటన పై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. మౌనరాగం, మనసు మమత లాంటి సీరియల్స్ లలో నటించింది.