సీరియల్ నటి ఆత్మహత్య కేసులో బయటపడ్డ అసలు నిజాలు
Admin - September 10, 2020 / 05:43 AM IST

హైదరాబాద్ లో ఓ టీవీ సీరియల్ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో అసలు నిజం బయటకు వచ్చింది. అయితే ఈ శ్రావణి ఆత్మహత్య కు కారణమైన దేవరాజురెడ్డి పోలీసుల ముందు లొంగిపోవడానికి సిద్ధమయ్యాడు. అయితే సాయి అనే వ్యక్తి శ్రావణిని తన ముందే చంపడానికి ప్రయత్నించాడని అన్నాడు. అలాగే సాయి అనే వ్యక్తి పెళ్లి చేసుకోవాలని శ్రావణి పై ఒత్తిడి తెచ్చాడని, పెళ్లి చేసుకోకపోతే చంపేస్తానాని బెదిరించడంతో శ్రావణి ఆత్మహత్య చేసుకుందని దేవరాజు తెలిపాడు. శ్రావణి కాల్ రికార్డింగ్ క్లిప్స్ పోలీసుల ముందుంచుతానని, తల్లిదండ్రుల ఒత్తిడితోనే శ్రావణి తన పై కేసు నమోదు చేసిందని అన్నాడు.
ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ లో పెళ్లి చేసుకోమని అడిగిందని, తాను ఒప్పుకోకపోయేసరికి తన పై ఆరోపణలు చేస్తున్నారని, అలాగే తన పై పెట్టిన కేసులను వెనక్కి తీసుకుంటానని శ్రావణి తనతో తెలిపిందని దేవరాజు తెలిపాడు. ఇది ఇలా ఉంటె గత ఎనిమిది సంవత్సరాల నుండి శ్రావణి టీవీ సీరియల్స్ లో నటిస్తుంది. ప్రస్తుతం శ్రావణి మనసుమమత, మౌన రాగం తో పాటు పలు సీరియల్స్ లో నటిస్తుంది.