నువ్వు ఏమైనా సూపర్ హిట్లు తీసావా అని పవన్ కళ్యాణ్ నన్ను మొకం పట్టుకొని అన్నాడు

Advertisement

హాస్య నటుడు, నిర్మాత బండ్ల గణేష్ తాను ఏది మాట్లాడిన కూడా కామిడీగా ఉంటుంది. అయితే గబ్బర్ సింగ్ సినిమాతో నిర్మాతగా మరి తన జీవితమే మలుపు తిరిగిపోయింది. అయితే కొన్ని రోజుల క్రితం బండ్ల గణేష్ కరోనా బారిన పడి ప్రస్తుతం కోలుకున్నాడు. ఇక బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కు వీర అభిమాని అని అందరికి తెలిసిందే.. అయితే తాజాగా ఓ ఇంటర్ వ్యూ లో పాల్గొన్న బండ్ల గణేష్ తన గబ్బర్ సింగ్ సినిమా తెరకెక్కించే క్రమంలో జరిగిన ఓ సంఘటనను గుర్తు చేసాడు.

గబ్బర్‌ సింగ్‌ సినిమాలో శ్రుతిహాసన్ ‌ను హీరోయిన్ గా వద్దని తాను పవన్‌కల్యాణ్‌కు చెప్పినట్లు బండ్ల గణేష్ తెలిపాడు. అందుకు పవన్‌ ఎందుకు శ్రుతి హాసన్ వద్దు అని అడిగాడు. ఆ అమ్మాయికి అన్నీ ఫ్లాప్‌లే బాబు అని గణేష్ అన్నాడు. అప్పుడు నువ్వేమైనా అన్నీ హిట్ ‌సినిమాలే తీశావా.. అంటూ పవన్‌ గణేష్ తో అనడంతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా శ్రుతి హాసన్ నే హీరోయిన్‌గా తీసుకున్నట్లు తెలిపాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here