Salman Khan: సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసి సంచలన వ్యాఖ్యలు

Salman Khan టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ ఇలా ఇండస్ట్రీ ఏదైన మహిళా నటులకు వేదింపులు మాత్రం కామన్. అయితే ప్రతి చోట ఇలాగే జరుగుతుందని లేదు. ఈ సమాజంలో అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లను టార్గెట్ చేసేవారు ఎక్కువగా ఉంటారు. ఈ విషయం పై ఎన్నో చర్చలు జరిగి వేదిక పైకి వచ్చి మరీ చర్చలు పెడుతున్నారు. అయితే ఇటీవల కాలంలో మీటూ అనే ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యింది. ఎంతోమంది నటీమణులు ఈ మీటూ ఉద్యమంలో భాగస్వాములయ్యారు.

Sensational comments by Salman Khan's ex-girlfriend
Sensational comments by Salman Khan’s ex-girlfriend

లేటెస్ట్ గా పాకిస్తాన్ హీరోయిన్, ఒకప్పటి సల్మాన్ ఖాన్ ప్రేయసి సోమి అలీ ప్రముఖ దర్శకులపై సంచలన వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. 1991 లో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ బ్యూటీ కెరీర్ ప్రారంభంలోనే సల్మాన్ ఖాన్ తో ప్రేమలో పడింది. బాలీవుడ్ లో బెస్ట్ జోడిగా పేరు తెచ్చుకున్నారు. సోమీ అలీకి ఇండస్ట్రీలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. అయితే లేటెస్ట్ గా ఆమె కొంతమంది దర్శకులపై కొన్ని మాటలు సంధిస్తుంది. కెరీర్ స్టార్టింగ్ లో తనకు సినిమా అవకాశాలు రావాలంటే తమకు కావాల్సింది ఇవ్వాలని కోరారని ఇలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారని.. తనలాంటి మరెంతోమంది నటులు వీటన్నింటినీ ఎదుర్కోంటున్నారని ఆమె తెలిపారు.

ఇటీవల కాలంలో ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో సోమీ అలీ మాట్లాడుతూ సల్మాన్ ఖాన్ పై కూడా విమర్శలు గుప్పించింది. తన సినీ కెరీర్ లో ఎన్నో కష్టాలను, చేదు అనుభవాల్ని ఎదుర్కున్నానని.. రాను రాను తన సినిమాలు సైతం ఫ్లాప్ కావడం జీవితంలో ఎంతో నిరాశను మిగిల్చిందని తెలిపారు. అలాంటి సమయంలోనే దర్శక నిర్మాతలు సైతం తమకు కావాల్సిందే ఇవ్వగలిగితే హీరోయిన్ గా అవకాశాలు కల్పిస్తామని చెప్పడంతో కెరీర్ పై ఆశలు వదులుకోవాల్సి వచ్చిందని తెలిపారు సోమి. ఇప్పటికీ సోమి అలీ హీరోయిన్ గా కంటే సల్మాన్ ఖాన్ మాజీ ప్రేయసిగానే ఇండస్ట్రీలో పరిచయం.

Advertisement