Senior Director Sagar Said An Interview About Arrest Of Suman : ఆ ముగ్గురి వల్లే సుమన్ జైలుకు వెళ్లాడా.. ఇన్నాళ్లకు బయట పడ్డ నిజం..!

NQ Staff - August 1, 2023 / 09:47 AM IST

Senior Director Sagar Said An Interview About Arrest Of Suman : ఆ ముగ్గురి వల్లే సుమన్ జైలుకు వెళ్లాడా.. ఇన్నాళ్లకు బయట పడ్డ నిజం..!

Senior Director Sagar Said An Interview About Arrest Of Suman :

హీరో సుమన్ జీవితంలో అతిపెద్ద సంఘటన అంటే నీలిచిత్రాల కేసులో జైలకు వెళ్లడం అని అందరూ అంటారు. అప్పట్లో చిరంజీవి కంటే పాపులర్ గా ఉన్న సుమన్.. వరుసగా సినిమాలు చేస్తున్న టైమ్ లో ఆయన మీద నీలిచిత్రాల కేసు నమోదైంది. దాంతో ఆయన ఆరు నెలలు జైలుకు వెళ్లారు. ఇంకేముంది ఇమేజ్ మొత్తం పోయింది. సినిమా ఛాన్సులు కూడా రాలేదు. కెరీర్ పతనం అయింది.

ఈ కేసులో ఆయన్ను కొందరు కావాలనే ఇరికించారనే టాక్ అప్పట్లో ఉంది. అలా ఇరికించిన వారిలో చిరంజీవి కూడా ఉన్నారనే ప్రచారం జరిగింది. అయితే అందరూ అనుకున్నట్టు అది నీలిచాత్రల కేసు కాదట. ఈ విషయాన్ని గతంలో దివంగత దర్శకుడు సాగర్ బయటపెట్టారు.

ఎంజీఆర్ సమయంలో..

తమిళనాడు సీఎంగా ఎంజీఆర్ ఉన్న సమయంలో ఓ డీజీపీ ఉండేవాడు. ఓ లిక్కర్ కాంట్రాక్టర్ కూడా ఎంజీఆర్ కు క్లోజ్. అయితే డీజీపీ కుమార్తెకు సుమన్ అంటే చాలా ఇష్టం. సుమన్ ఎక్కడ సినిమాలు చేస్తే అక్కడకు వెళ్లిపోయేది. కానీ సుమన్ ఆమెను పట్టించుకోలేదు. ఆమెది కేవలం వన్ సైడ్ లవ్. కానీ ఆమెకు అప్పటికే పెండ్లి అయింది.

ఈ విషయం తెలుసుకున్న డీజీపీ.. తన కుమార్తెను సుమన్ ట్రాప్ చేశాడని తప్పుగా అర్థం చేసుకున్నాడు. అప్పట్లో సుమన్ ఫ్రెండ్ కు క్యాసెట్ల షాప్ ఉండేది. అతను లిక్కర్ కాంట్రాక్టర్ కుమార్తెను ప్రేమించాడు. ఈ విషయాలన్నీ తెలుసుకున్న డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్ సీఎం ఎంజీఆర్ కు వివరించారు. ఎంజీఆర్ చెప్పినా సుమన్ పెద్దగా పట్టించుకోలేదు. నా తప్పులేదు.

కావాలంటే ఆమెకు చెప్పుకోండి అన్నారు. దాంతో కోపగించుకున్న ఎంజీఆర్ డీజీపీ, లిక్కర్ కాంట్రాక్టర్ తో కలిసి బెయిల్ రాని విధంగా కేసుల్లో సుమన్ ను ఇరికించారు. అంతే గానీ ఇది నీలిచిత్రాల కేసు కాదు. పైగా ఇందులో ఏ హీరో ప్రమేయం కూడా లేదు అని తెలిపాడు సదరు దర్శకుడు.

Read Today's Latest సినిమా వార్తలు in Telugu. Get LIVE Telugu News Updates on TheNewsQube

Follow Us