Annapurna: త‌న కూతురి ఆత్మ‌హ‌త్యపై తొలిసారి స్పందించిన సీనియ‌ర్ న‌టి

Annapurna: న‌టిగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా వంద‌ల సినిమాలలో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు అన్న‌పూర్ణ‌. ‘స్వర్గం నరకం’ అనే సినిమాతో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయిన ఆమె 700కి పైగా సినిమాల‌లో న‌టించారు. అయితే దత్త పుత్రికను ఎంతో ఆప్యాయంగా పెంచుకొని పెళ్లీడుకొచ్చాక ఘనంగా వివాహం జరిపించి అత్తారింటికి పంపారు అన్నపూర్ణ. కొంత కాలం త‌ర్వాత ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం ఆమె కుటుంబానికి తీర‌ని శోకాన్ని మిగిల్చింది.

annapurna

అన్న‌పూర్ణ కూతురు మ‌ర‌ణం అప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన కూతురు మనస్తత్వం గురించి ఓపెన్‌గా మాట్లాడిన అన్నపూర్ణ.. ఆమె మరణంపై రియాక్ట్ అయ్యారు. దత్త పుత్రికను ఎంతో ఆప్యాయంగా పెంచుకొని పెళ్లీడొచ్చాక అత్తారింటికి పంపారు అన్నపూర్ణమ్మ. తన స్తోమతకు తగ్గట్లుగా కట్న కానుకలు కూడా ఇచ్చి సాగనంపారు.

సంసారం సాఫీగా సాగుతున్న నేప‌థ్యంలో ఓ బిడ్డ‌కు జ‌న్మ కూడా ఇచ్చింది. అయితే కొద్ది రోజుల త‌ర్వాత ఉరి వేసుకొని ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డం అంద‌రికి షాక్ క‌లిగించింది. కూతురిని పెద్ద పెద్ద చ‌దువుల చ‌దివించాల‌ని అన్న‌పూర్ణ భావించింది. కానిఆమెకు చ‌దువు అబ్బ‌క‌పోవ‌డంతో తెలిసిన వాళ్ల‌లో సంబంధం చూసింది. ఇద్ద‌రికి నచ్చ‌డంతో త్వ‌ర‌గానే పెళ్లి కూడా జ‌రిగింది. ఓ రోజు ఉదయాన్నే మా అల్లుడు ఫోన్‌ చేసి మీ కూతురు ఫ్యాన్‌కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చెప్పాడు.

annapurna

కీర్తి ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి కార‌ణం ఇప్ప‌టికీ తెలియ‌దు. నా కూతురికి కోపం ఎక్కువ‌. చాలా గారాబంగా పెంచాం. ఇంట్లో ఏ ప‌ని రాదు. భార్య‌, భ‌ర్త‌ల గొడ‌వ‌నా లేక మెట్టినింట్లో ఏమైన ఇబ్బందులు వ‌చ్చాయా తెలియ‌దు. ఆ విష‌యాల గురించి నా కూతురు ఎప్పుడు చెప్ప‌లేదు. క్షణికావేశంలో మరి అలాంటి నిర్ణయం తీసుకుందో తెలియదు. కానీ ఇప్పుడు ఈ లోకంలో లేదు’ అంటూ గతాన్ని తలుచుకొని బాధపడింది అన్న‌పూర్ణ‌.

నా బిడ్డకు పుట్టిన పాపను కొన్ని నెలల పాటు తానే పెంచానని చెప్పిన అన్నపూర్ణ.. ఆ తర్వాత ఆమె వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్లిపోయిందని చెప్పారు. ప్రస్తుతం ఆ పాప వయసు 5 సంవత్సరాలు ఉంటుందని.. నాన్నతో సంతోషంగా ఉంటోందని అన్నపూర్ణ చెప్పారు..